NRI-NRT

ఆకట్టుకున్న వర్ధిపర్తి పద్మాకర్ అవధానం

ఆకట్టుకున్న వర్ధిపర్తి పద్మాకర్ అవధానం

భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారు ముఖ్య అతిథి- సప్త ఖండాల మహిళా పృచ్ఛకులతో అంతర్జాల వేదికగా త్రిభాషా మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి 13వ శతావధానం ఘనవిజయం
Whats-App-Image-2022-11-03-at-3-44-38-PM-2
* “సప్తఖండ అవధాన సాహితీ ఝరి – త్రయోదశ శతావధానం – అష్టోత్తర శత మహిళా పృచ్ఛకురాండ్రతో సరస్వతీ సమర్చనం”  అనే అపూర్వ శతావధాన కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా అన్ని ఖండాల నుండి 108 మంది మహిళా శిరోమణులు పాల్గొన్న “సప్త ఖండ అవధాన సార్వభౌమ” బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు శ్రీ ప్రణవ పీఠం, ఏలూరు వేదికగా అత్యద్భుతంగా నిర్వహించారు.
Whats-App-Image-2022-11-03-at-3-44-38-PM-1
* ప్రారంభోత్సవ సభలో ప్రముఖ మంత్రివర్యులు గౌరవనీయులు మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్, మాజీ అఖిలభారత బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీమాన్ శ్రీ పోల్సాని మురళీధర రావు గారు హాజరై సభను ప్రారంభించారు.
Whats-App-Image-2022-11-03-at-3-44-38-PM
* ఈ శతావధానం  రెండున్నర రోజులు జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా  అంతర్జాతీయ తెలుగు సంస్థలు:  
ఆస్ట్రేలియా ఖండం (ఆస్ట్రేలియా), ఆసియా ఖండం ( మలేసియా, భారతదేశం, సింగపూర్, మలేషియా, ఖతార్   తెలుగు సంఘం , ఐరోపా ఖండం (యునైటెడ్ కింగ్ డమ్, లండన్), ఉత్తర అమెరికా ఖండం (యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, కెనడా), ఆఫ్రికా (దక్షిణ ఆఫ్రికా), దక్షిణ అమెరికా (కొలంబియా) ల నుండి 108 మంది మహిళలు పాల్గొన్నారు.  78 సమస్యలు, 33 ఆశువులు, నలుగురి అప్రస్తుత ప్రసంగాలతో సభ విరాజిల్లింది.  మూడవ రోజు ఉదయం అత్యద్బుతంగా జరిగిన ధారణ సభ నయనానందకరంగా ఒక  పండుగ వాతావరణాన్ని తలపించింది.  ప్రత్యక్షంగానూ, అంతర్జాలం లోనూ తిలకిస్తున్న సాహితీప్రియులు అచ్చెరువొందేలా భాషా ప్రేమికులు విస్మయం చెందేలా “అవధాన కళా మౌళి”, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు తాము గత రెండు రోజుల్లో పూరణ చేసిన 78 సమస్యలని కేవలం 55 నిమిషాల్లో ఆశ్చర్యకరంగా ధారణ చేసారు.  మహాధారణ అయిన తరువాత కూడా మరొక సమస్య తీసుకుని ద్యపూరణ చేయడం అసాధారణం. ఈ అవధానంలో అన్నీ సమస్యాంశాలను తీసుకోవడం కూడా మరొక నూతనప్రయోగం. ప్రణవ పీఠం స్వచ్ఛంద కార్య నిర్వాహకురాలు అమెరికా టెక్సాస్ నుండి శ్రీమతి కృష్ణ పద్మ తెలియచేసారు.
Whats-App-Image-2022-11-03-at-3-44-39-PM-1
* అనంతరం జరిగిన విజయోత్సవ సభలో భారతదేశం పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు, మాన్యులు, శ్రీమాన్ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ముఖ్యఅతిథిగా  పాల్గొన్నారు. తెలుగు భాషలో ప్రత్యేకమైన ప్రక్రియగా అవధానానికి ఉన్న స్థానం సుస్థిరమని తెలిపారు.అచ్చంగా మహిళా పృచ్ఛకురాండ్రతో అవధాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అతిథిగా డాక్టర్ కోలవెన్ను మలయవాసిని గారు, డాక్టర్ శారదా పూర్ణ సుసర్ల శొంఠి గారు, శ్రీమతి బులుసు అపర్ణ గారు, శ్రీ మా శర్మ గారు, డాక్టర్ సుహాసిని ఆనంద్ కొమరగిరి,పాలడుగు శ్రీచరణ్ గారితో పాటు ప్రపంచంలో ఏడు ఖండాల నుంచి తెలుగు భాషాభిమానులు, పలు తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అంతర్జాతీయ తెలుగు సంస్థలకు శ్రీమతి కృష్ణ పద్మ గారు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా  ఉత్తర అమెరికా ఖండం – తెలుగు తల్లి కెనడా – శ్రీమతి లక్ష్మి రాయవరపు గారు; యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా – యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ప్రణవ పీఠం నుంచి శ్రీ రావు తల్లాప్రగడ గారు., ఆసియా ఖండం – మలేషియా తెలుగు సంఘం – డా. వెంకట ప్రతాప్ గారు, శ్రీమతి సత్య మల్లుల గారు, ఆఫ్రికా ఖండం – దక్షిణ ఆఫ్రికా సాహిత్య వేదిక -రాపోలు సీతారామరాజు.
Whats-App-Image-2022-11-03-at-3-44-39-PM
* అవధానిగా, కవిగా, సంగీతవేత్తగా, పౌరాణికులుగా, ప్రవచనకర్తగా, శ్రీ ప్రణవపీఠ స్థాపకులుగా, త్రిభాషా కోవిదులుగా అవధాన ఋషిమండలంలో విశిష్ట స్థానాన్ని పొందిన వశిష్టులు శ్రీ వద్దిపర్తి వారని అందరూ కొనియాడారు. కరోనా కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకొని, అందివచ్చిన ఆధునిక సాంకేతికతను అపురూపంగా, అపూర్వంగా మలచుకున్న ఘనత వారికే దక్కుతుంది. వారి మనస్సంకల్పజనితమైన “సప్తఖండ అవధాన సాహితీ ఝరి” ఎన్నో ప్రపంచ రికార్డులను సొంతం చేసుకోవడం అందుకు నిలువెత్తు నిదర్శనం. ఇప్పుడు జరిగిన శతావధానం అపూర్వమైనది.  ప్రపంచంలోని సప్త ఖండాల నుంచి, అందునా, అందరూ మహిళా పృచ్ఛకులుగా ఇంత పెద్ద స్థాయిలో ‘శతావధానం’ నిర్వహించడం ఘనతరమైన సారస్వత సాహసం. ఇది ముందెన్నడూ జరగని అపురూప దృశ్యం. 
Whats-App-Image-2022-11-03-at-3-44-40-PM-2
* పద్యం మన సంపద. అవధానం మన సంతకం. ఈ మార్గంలో నడుస్తున్న ప్రతి కవీ ధన్యులు. ఆ విధంగా బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు పరమ ధన్యులు, సరస్వతీస్వరూపులు.
Whats-App-Image-2022-11-03-at-3-44-40-PM-1
*స్వచ్ఛంద కార్య నిర్వాహకురాలు అమెరికా టెక్సాస్ నుండి శ్రీమతి కృష్ణ పద్మ తెలియచేసారు. సప్తఖండాల నుండి వివిధ దేశాల సాహిత్య నిపుణులు పాల్గొని సాహిత్య వేదిక అంగరంగంగా అలరించింది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్న నానుడితో సభ జయప్రదంగా ముగిసింది.
Whats-App-Image-2022-11-03-at-3-44-40-PM
Whats-App-Image-2022-11-03-at-3-44-41-PM
Whats-App-Image-2022-11-03-at-3-44-42-PM-2
Whats-App-Image-2022-11-03-at-3-44-42-PM-1
Whats-App-Image-2022-11-03-at-3-44-42-PM
Whats-App-Image-2022-11-03-at-3-44-43-PM-1
Whats-App-Image-2022-11-03-at-3-44-43-PM