Politics

రాజకీయాల్లో రాణించాలంటే ప్రతిభ ఉండాలి

రాజకీయాల్లో రాణించాలంటే ప్రతిభ ఉండాలి

రాజకీయాల్లో ప్రవేశాలకు మాత్రమే వారసత్వం ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతిభ లేకుండా రాజకీయాల్లోనూ ఎవరూ రాణించలేరని, సొంతంగా నిరూపించుకోలేకపోతే ఏ వారసత్వాన్ని కూడా ప్రజలు భరించరన్నారు. ఇందిరాగాంధీ వంటి మహానేతలనే ప్రజలు ఓడించారు. మొదటి ఎన్నికల్లో తాను చాలా కష్టం గెలిచాను.. పనితీరుతోనే సిరిసిల్లలో తన మెజారిటీని క్రమంగా పెంచుకోగలిగానని చెప్పారు. సరిగా పనిచేయకపోతే సిరిసిల్ల ప్రజలు తనను కూడా పక్కన పెట్టేవారని చెప్పారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరిగిన మీడియా ఇన్‌ తెలంగాణ సదస్సుకు మంత్రి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏది న్యూసో, ఏది వ్యూసో తెలుసుకోవడానికి అనేకసార్లు పేపర్లు చదవాల్సి వస్తుందన్నారు. ఐదు కేటగిరీల వాళ్లనే జనం చదువుతున్నారని పత్రికలు కూడా వాళ్లకే ప్రాధాన్యమిస్తున్నాయని వెల్లడించారు.