NRI-NRT

కెనడా సైన్యంలోకి భారతీయులు!

కెనడా సైన్యంలోకి భారతీయులు!

సైన్యంలో చేరికలు తక్కువగా ఉండటం, పలు విభాగాల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఏండ్లుగా కొనసాగుతున్న నేపథ్యంలో కెనడా ఆర్మీ కీలక ప్రకటన చేసింది. దేశంలోని శాశ్వత నివాసిత హోదా ఉన్నవారు కూడా మిలిటరీలో చేరవచ్చని కెనడియన్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌(సీఏఎఫ్‌) పేర్కొన్నది. కెనడాలో శాశ్వత హోదా ఉన్న విదేశీయుల్లో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉన్నది. ఈ నేపథ్యంలో భారతీయులు కూడా కెనడా సైన్యంలో చేరేందుకు అవకాశం ఏర్పడింది. ఐదేండ్ల క్రితం రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌ (ఆర్సీఎంపీ) విభాగ అధికారులు కూడా తమ కాలం చెల్లిన రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను మార్చేశారు. కెనడాలో పదేండ్లుగా నివాసం ఉంటున్న శాశ్వత నివాసితులు కూడా ఆర్సీఎంపీలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నది. కెనడాలో శాశ్వత నివాసితులు అంతకుముందు స్కిల్డ్‌ మిలిటరీ ఫారిన్‌ అప్లికెంట్‌(ఎస్‌ఎంఎఫ్‌ఏ) కింద మాత్రమే అర్హులుగా ఉండేవారు. దీని ద్వారా శిక్షణ పైలట్‌, డాక్టర్‌ వంటి ప్రత్యేక అవసరాలు ఉన్న నియామకాలు చేపట్టేవారు.