Business

ఏపీ యువకునికి అమెరికాలో భారీ ప్యాకేజీ తో ఉద్యోగం

ఏపీ  యువకునికి అమెరికాలో భారీ ప్యాకేజీ  తో ఉద్యోగం

ఏపీకి చెందిన ఓ యువకుడు భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం సంపాదించాడు. ఏకంగా ఏడాదికి రూ.1.7 కోట్ల ఆఫర్‌తో క్వాల్‌కం(Qualcomm) కంపెనీలో జాబ్ లభించింది. సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం గొల్లపల్లికి చెందిన భార్గవ్‌కుమార్‌రెడ్డి అమెరికాలోని అరిజోనా యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. మరో నెలలో చదువు పూర్తికానుంది. ఇంతలోనే వచ్చిన క్యాంపస్ ఇంటర్వ్యూలో భార్గవ్‌ కుమార్‌రెడ్డి ఉద్యోగం పొందాడు. అతని నైపుణ్యాన్ని గుర్తించిన క్వాల్‌కామ్ కంపెనీ రూ. 1.70 కోట్ల ప్యాకేజీ అందజేసింది. చదువు పూర్తయ్యాక అతడు ఉద్యోగంలో చేరనున్నాడు. అధునాతన చిప్‌ల తయారీలో పనిచేయనున్నాడు. భార్గవ్ ప్రతిభను గుర్తించిన అరిజోనా యూనివర్సిటీ ఇప్పటికే రూ. 20 లక్షలు స్కాలర్‌ షిప్‌ అందిస్తుంది.