NRI-NRT

NYTTA నూతన అధ్యక్షుడిగా గడ్డం సునీల్ రెడ్డి

NYTTA నూతన అధ్యక్షుడిగా గడ్డం సునీల్ రెడ్డి

న్యూయార్క్ తెలంగాణా తెలుగు సంఘం (NYTTA)2023 సంవత్సరానికి తమ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది.

సునీల్ రెడ్డి గడ్డం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా వాణి సింగిరికొండ, కార్యదర్శిగా గీత కనకాల, కోశాధికారిగా రవీందర్ కోడెల, సహాయ కార్యదర్శిగా హారిక జంగం, సహాయ కోశాధికారిగా ప్రసన్న మధిరలు ఎన్నికయ్యారు. కృష్ణారెడ్డి తురుక, పద్మ తాడూరి, హరిచరణ్ బొబ్బిలి, సుదీర్ సువ్వ, నరోత్తం రెడ్డి సభ్యులుగా, అలేఖ్య వింజమూరి, ప్రవీణ్ కుమార్ చామ సమన్వయకర్తలుగా ఎన్నికయ్యారు.

కార్యక్రమంలో డా.పైళ్ల మల్లారెడ్డి, వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాస్ గూడూరు, సలహా సంఘ సభ్యులు ప్రదీప్ సామల, చినబాబు రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చైర్మన్ డా.రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్-చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి అనుగు, కార్యదర్శి సతీష్ కల్వ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉషారెడ్డి మన్నెం, సహోదర్ పెద్దిరెడ్డి, పవన్ కుమార్ రవ్వ, మల్లిక్ రెడ్డి, డా.వేణుగోపాల్ పల్లా, డా. కృష్ణ బాధే, రమ కుమారి వనమ తదితరులు పాల్గొన్నారు.