Movies

చిరంజీవి కుటుంబంలో సందడి

చిరంజీవి కుటుంబంలో సందడి

80d9be2d-f8d2-455d-b39d-1d8830458b35

మెగా కుటుంబంలో సందడి నెలకొంది. అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ఆనందకర సమయం వచ్చేసింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. శ్రీ ఆంజనేయస్వామి వారి ఆశీస్సులతో రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

ఉపాసన తొలి బిడ్డకు జన్మనివ్వబోతోందని చెప్పారు. చిరు చేసిన ఈ ట్వీట్ తో మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.