Movies

మహానటి సావిత్రి వర్ధంతి సందర్భంగా.. జీవిత విశేషాలు

మహానటి సావిత్రి వర్ధంతి సందర్భంగా.. జీవిత విశేషాలు

నిశ్శంకర సావిత్రి (డిసెంబరు 6, 1936 – 1981 డిసెంబర్ 26) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు. అభిమానులచేత మహానటిగా కీర్తింపబడింది
🌷వర్ధంతి🌷

అభినేత్రి సావిత్రి చిత్రచరిత్ర

మొత్తం నటించిన చిత్రాల సంఖ్య 246

తెలుగు – 142,. తమిళం – 94, హిందీ – 5, కన్నడం – 3, మళయాళం – 2 / అత్యధికంగా హీరోలతో హీరోయిన్ గా నటించిన చిత్రాలు.. జెమిని గణేశన్ – 38, అక్కినేని నాగేశ్వరరావు – 29, ఎన్ టి రామారావు – 26, ధర్మేంద్ర – 2 / తొలిచిత్రం – సంసారం (1950), చివరి చిత్రం – అందరికంటే మొనగాడు (1985) / 50వ చిత్రం – ఆరాదన (ఏయన్నార్), 100వ చిత్రం – పుట్టినిల్లు మెట్టినిల్లు (1973) / నటనా పరంగా తొలి మూడు చిత్రాలు – మాయాబజార్, చివరకు మిగిలేది, సుమంగళి (ఏయన్నార్) / రేలంగితో హీరోయిన్ గా జతకట్టిన చిత్రం – మామకు తగ్గ అల్లుడు, పద్మనాభంకి భార్యగా నటించిన చిత్రం – మూగమనసులు / తన పాట తానే పాడిన పాట గల చిత్రం – నవరాత్రి / కొన్ని సన్నివేశాలలో కాస్త అతిగా నటించిన చిత్రం – నవరాత్రి / హీరో వికలాంగుడని తెలిసినా ఇష్టపడి పెళ్ళి చేసుకున్న చిత్రం – కలసివుంటే కలదుసుఖం / అగ్ర హీరోని డైరెక్ట్ చేసిన చిత్రం – మాతృదేవత (ఎన్టీఆర్) / ధర్మేంద్ర తో నటించిన 2 చిత్రాలు – సితారోంసే ఆగే & గంగాకి లహరేం / నటించిన అత్యద్భుత నవలా చిత్రం – డాక్టర్ చక్రవర్తి / హీరో తొమ్మిది పాత్రలతో తలపడి నవరసాలను ప్రతిభావంతంగా పోషించిన చిత్రం – నవరాత్రి (జెమిని గణేశన్) & నవరాత్రి (అక్కినేని నాగేశ్వరరావు) / హీరోయిన్ ఐనా సావిత్రికి అంతగా ప్రాధాన్యం లేని చిత్రం – ప్రాణమిత్రులు / సావిత్రి మంచిని కోరి ఆమెని ఎక్కువగా అభిమానించిన నటుడు – గుమ్మడి.. మహానటికి వందనం.. —— స్వామి (నాని)