Devotional

తిరుమలలో పార్వేటి ఉత్సవం

తిరుమలలో పార్వేటి ఉత్సవం

కనుమ పండుగను పురస్కరించుకుని తిరుమలలో
పార్వేట ఉత్సవంను టీటీడీ వైభవంగా నిర్వహించింది.
పాపవినాశనం రహదారిలోని అటవీ ప్రాంతంలోని
పార్వేట మండపం వద్ద ఉత్సవాన్ని నిర్వహించారు.
పార్వేట మండపం వద్ద తిరుమంజనం నిర్వహించిన
అనంతరం స్వామివారు వేటకు వెళ్లే సన్నివేశాలను
కనుల పండుగగా సాగాయి.. అర్చకులు మూడు
సార్లు స్వామి వారి తరపున ఈటెను విసిరి పార్వేట
ఉత్సవం జరిపారు.