Movies

జానపద చిత్రాల మాంత్రికుడు.. విఠలాచార్య జయంతి నేడే.

జానపద చిత్రాల మాంత్రికుడు.. విఠలాచార్య జయంతి నేడే.

💐💐భారతీయ చలన చిత్ర దర్శకులు, జానపద బ్రహ్మ,తెలుగు సినిమా ఖ్యాతిని శిఖరాగ్రానికి చేర్చిన బి.విఠలాచార్య గారి జయంతి సందర్భంగా💐💐

#లైట్లారిన థియేటర్లలో హఠాత్తుగా తోక దెయ్యాలు ప్రత్యక్షమై వికటాట్టహాసం చేస్తుంటే… ఊడలమర్రి నుంచి లెక్కలేనన్ని అస్థిపంజరాలు వేలాడుతూ వికృతచేష్టలు చేస్తుంటే… నల్లని బురఖాలాంటి దుస్తులు ధరించి నుదురంతా వ్యాపించే కుంకుమ బొట్టుతో, ఓ చేతిలో మంత్రదండం, మరో చేతిలో నిమ్మకాయలతో చేతబడి చేసే మాహా మాంత్రికులు అతి భీకరంగా నవ్వుతుంటే… అంబరచుంబిత రాజా భవంతులు, రెక్కల గుర్రాలు, ఆకర్షనీయమైన వస్త్రాల్లో రాజ కుమారులు, పాల వెన్నెల్లాంటి తెల్లని పల్చని దుస్తుల నుంచి పారదర్శకంగా పరువాలను నేత్రపర్వంగా ప్రదర్శించే అందాల రాకుమార్తెలు… ఇవన్నీ ఓ చిత్రంలో ఉంటే… కచ్చితంగా ఆ చిత్రం విఠలాచార్యదే.

#జురాసిక్ పార్క్’లో రాక్షస బల్లుల్ని చూసి స్పీల్‌బర్గ్‌ ని బ్రహ్మాండంగా మెచ్చుకున్నాం! వాళ్లకు హైటెక్ కెమెరాలు, అడ్వాన్స్ గ్రాఫిక్సులున్నాయ్!మిలియన్ డాలర్ల డబ్బులున్నాయి ! విఠలాచార్య దగ్గర ఇవేవీ లేవు. ఆయన దగ్గర ఉందల్లా ఓ మిఛెల్ కెమెరా,మూణ్ణాలుగు లక్షల బడ్జెట్టు మాత్రమే ! వీటితోనే వెండితెరపై పరకాయ ప్రవేశాలు… గుర్