DailyDose

పామర్రు లో తానా ఉచిత కంటి వైద్య శిబిరం

పామర్రు లో తానా ఉచిత కంటి వైద్య శిబిరం

null
పామర్రు పాలకేంద్రం లో తానా ఫౌండేషన్, కృష్ణా మిల్క్ యూనియన్ మరియు రోటరీ క్లబ్ వారిచే సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ యార్లగడ్డ వెంకటరమణ గారు ప్రారంభించారు. మొత్తం 774 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా 111 మంది కాట్రాక్టు సర్జరీ అవసరమైన వారు ఉన్నారు. 663 మందికి ఉచితంగా కళ్ళజోళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ అధ్యక్షులు వెంకటరమణ యార్లగడ్డ గారితో పాటు కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల యూనియన్ అధ్యక్షులు చలసాని ఆంజనేయులు గారు, సుమారుగా 800మంది రైతులు పాల్గొన్నారు.
null
null
null