DailyDose

చికాగోలో తెలుగు విద్యార్థి పై కాల్పులు

చికాగోలో తెలుగు విద్యార్థి పై కాల్పులు

తెలంగాణకు చెందిన విద్యార్థిపై చికాగోలో నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి చరణ్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. సాయి చరణ్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లగా.. మరో విద్యార్థికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల విషయాన్ని సాయి చరణ్ స్నేహితులు.. అతని కుటుంబానికి చేరవేశారు. దీంతో.. సాయి చరణ్ కుటుంబ సభ్యులు తీవ్రం భయాందోళకు గురవుతున్నారు. అయితే.. కాల్పులు ఎందుకు జరిపారన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

చికాగోలో తెలంగాణ విద్యార్థిపై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సదరు విద్యార్థితో పాటు మరో విద్యా్ర్థికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా బీహెచ్‌ఈఎల్ ఎల్ఐసీ కాలనీకి చెందిన కొప్పాల సాయి చరణ్ అనే విద్యార్థి.. పై చదువుల కోసం జనవరి 11వ తేదీన చికాగోకు వెళ్లాడు. చికాగోలోని గవర్నర్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఒక్కసారిగా సాయి చరణ్‌పై నల్ల జాతీయులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సాయి చరణ్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. సాయి చరణ్‌తో పాటు మరో విద్యార్థికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. అయితే.. సాయిచరణ్ మీద నల్ల జాతీయులు కాల్పులు ఎందుకు జరిపారన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

కాల్పులు జరిపిన వెంటనే సాయి చరణ్‌ను తోటి విద్యార్థులు, కాలేజీ యజమాన్యం చికాగో యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు తరలించారు. సాయి చరణ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సాయి చరణ్.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే.. సాయి చరణ్‌కు జరిగిన ఘటన గురించి చికాగో నుంచి అతని స్నేహితులు, తల్లిదండ్రులకు సమాచారాన్ని అందించారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు తీవ్ర తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. అక్కడ సాయి చరణ్ పరిస్థితి ఎలా ఉందోనని ఆందోళనకు గురవుతున్నారు.