Business

TNI నేటి తాజా వార్తలు. అదానీకి వ్యతిరేకంగా ఉద్యమం

TNI నేటి తాజా వార్తలు. అదానీకి వ్యతిరేకంగా ఉద్యమం

ఢిల్లీ: అదానీ వ్యవహారం, కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం.. అన్ని రాష్ట్రాలను కూడగట్టుకుని పోరాటం చేస్తాం.. అదానీ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తాం.-బీఆర్‌ఎస్ ఎంపీలు

* అమరావతి

నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైసిపి ఇన్చార్జిగా ఆదాల నియామకం

వెల్లడించిన సజ్జల

కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రితో భేటీ అయిన బాలినేని, ఆదాల

ముఖ్యమంత్రితో భేటీ ముగిసిన తర్వాత ఆదాల నియామకాన్ని ప్రకటించిన సజ్జల

* అమరావతి: డిసెంబర్‌ 25న కోటంరెడ్డి, చంద్రబాబును కలిశారు.. ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు.. జగన్‌ మళ్లీ సీఎం కావాలని కోరుకుంటే లోకేష్‌తో టచ్‌లో ఎందుకు ఉన్నారు.. మా ఎమ్మెల్యేలపై మేమెందుకు నిఘా పెట్టుకుంటాం. -పేర్ని నాని

కోటంరెడ్డి చేసింది నమ్మక ద్రోహం.. వైఎస్‌ జగన్ నమ్మి టికెట్ ఇస్తే ఇలా చేయటం తప్పు.. పక్షులు వలస వెళ్లే కాలం ఇది.. మేం కూడా విచారణ చేయమని అడుగుతాం.. ఏముంది దాంట్లో.. లోకేష్ తో టచ్ లో ఉండొచ్చా? నిఖార్సుగా ఉంటే ఫోన్ ట్యాపింగ్‌తో భయం ఎందుకు-పేర్నినాని

* సీఎం ఆదేశాలతో అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులు వేగవంతం.

సీఎం జగన్ ఆదేశాల మేరకు స్మృతివనం పనులు పరిశీలన

పరిశీలనలో పాల్గొన్న మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మీ

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయ తలపెట్టిన అంబేద్కర్ స్మృతివనం, అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహం పనులు విజయవాడ స్వరాజ్య మైదానంలో వేగవంతంగా జరుగుతున్నాయి.ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ పనులను రాష్ట్ర మున్సిపల్ శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి అక్కడ జరుగుతున్న పనులను గురువారం పరిశీలించారు.
అంబేద్కర్ స్మృతివనం పనులు పరిశీలించిన వారిలో శ్రీలక్ష్మితో పాటు
ఏపీ.ఐ.ఐ.సీ, వి.సి&ఎం.డి, సృజన, నగర మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ పుండ్కర్ పలువురు అధికారులు,ఇంజనీర్లు పాల్గొన్నారు.ఈ సందర్భం గా స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మి మీడియాతో మాట్లాడారు.
125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం నిర్మాణ పనులు వేగవంతం అయ్యేందుకు,అంబేద్కర్ స్మృతివనం పనులు నాణ్యత పై సీఎం జగన్ ఆదేశాల మేరకు గురువారం పనులు పరిశీలన చేసినట్లు ఆమె తెలిపారు. నాణ్యతా, ప్రమాణాలపై కాంట్రాక్టర్ల కు సూచనలు చేయటం జరిగింది అని ఆమె అన్నారు.అంబేద్కర్ స్మృతివనం నిర్మాణ వ్యయం 286 కోట్లు అని,ఈ స్మృతివనం లో ప్రత్యేకంగా2000 మంది సామర్థ్యం తో ఆడి టోరియం.500 మంది సామర్థ్యంతో ఓపెన్ థియేటర్, ధ్యాన మందిరం నిర్మాణాలు జరుగు తున్నాయని శ్రీలక్ష్మి తెలిపారు.విజయవాడలో కంట్రోల్ రూమ్ సమీపంలో ఉన్న వైఎస్సార్ విగ్రహం నుండి బందర్ రోడ్డులో అంబేద్కర్ స్మృతివనం వనం వరకు రోడ్డుకు ఇరుప్రక్కల నిర్మాణం చేయనున్న ఫ్లాట్ ఫామ్ లను ఆకర్షణీయమైన టైల్స్ తో ఆరు కిలోమీటర్ల ప్రాంతాన్ని సుందరీకరణ చేయనున్నట్లు ఆమె చెప్పారు.2023 ఏప్రియల్ 14 అంబేద్కర్ జయంతి రోజు అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహ ప్రతిష్టాపన చేయాలని అనుకుంటున్నట్లు చెపుతూ,రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రారంభానికి పనులు వేగవంతం అయ్యేందుకు పరిశీలన చేసినట్లు శ్రీ లక్ష్మీ తెలిపారు.

* పలమనేరులో నారా లోకేష్ ను కలిసిన టమోటా రైతులు
• పలమనేరులో నారా లోకేష్ ను కలిసిన టమోటా రైతులు.
• గిట్టుబాటు ధర లేక నష్టాలపాలవుతున్నామని ఆవేదన
• కిలో టమోటా రూపాయి ధర కూడా పడటంలేదని మొర
• కోత ఖర్చులు కూడా రాకపోవడంతో పంటలు చేలో వదిలేస్తున్నామన్న రైతులు
• పంట నష్టపరిహారం రాలేదని లోకేష్ దృష్టికి తీసుకొచ్చిన రైతులు
………………
• రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని జగన్ మోసం చేశాడు.
• దేశంలోకెల్లా ఏపీలోనే అప్పుల్లో ఎక్కువ మంది రైతులు.
• టమోటాకు మద్ధతు ధర లేక రోడ్లపై పడేసే పరిస్థితి
• రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేక సీఎం చేతులెత్తేశారు.
• అధికారంలోకి రాగానే రైతులందరికీ గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు
– నారా లోకేష్

* కృష్ణా జిల్లా ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలుగా జరుగుతాయి.
ఈ సంవత్సరం ఉత్సవాలలో భాగంగా,
వీరమ్మతల్లికి గండ దీపాలతో స్వాగతం పలుకుతున్న అశేష ప్రజానీకం

* నర్సంపేట నియోజక వర్గం

లింగగిరి ఎక్స్ రోడ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల గారు

వైఎస్ షర్మిల గారు
YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు

-. రెండు నెలల క్రితం తెరాసా గూండాలు ఇక్కడే మాపై దాడి చేశారు

-. కేసీఅర్ గూండాలు ఇక్కడ విగ్రహాన్ని ధ్వంసం చేశారు

-. ఇక్కడ నుంచి బలవంతంగా మమ్మల్ని హైదరాబాద్ తరలించారు

-. మీ బెదిరింపులకు బయపడదు వైఎస్సార్ బిడ్డ

-. 9 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు..ఏమైనా చేశారా

-. ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా..?

-. కెసిఆర్ పాలనకు అంతం పలకాలి

-. ఈ ఏడాది ఎన్నికలు ఉన్నాయి

-. మళ్ళీ వస్తాడు కేసీఅర్ సారు

-. మంచి మంచి మాటలు చెప్తారు

-. మళ్ళీ మళ్ళీ కేసీఅర్ మాటలకు మోస పోవద్దు

– డబ్బులు బాగా ఇస్తారు.. ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి

-. కానీ మీకోసం పాటు పడే పార్టీకే ఓటు వేయండి

-. వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు అమలు చేయడమే నా ధ్యేయం

-. ప్రజల పక్షాన నిలబడత

* గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి గారు ఈ రోజు ఢిల్లీ లో గౌరవ కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వని వైష్ణవ్ గారిని కలసి కడప – బెంగళూరు మధ్య మార్పు చేసిన కొత్త అలైన్మెంట్ ను తొందరగా అప్రూవ్ చేయాలని కోరారు..గతంలో2021 జూన్ మాసం లో ఈ సమస్యను ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ గారి ద్వారా రైల్వే బోర్డు చైర్మన్ త్రిపాటి దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసిన ఆ కాఫీ ని కూడా ఈ వినతికి జత చేసినట్లు ఎంపీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. . గతంలో ఉన్న ఒరిజినల్ అలైన్మెంట్ ఎక్కువ దూరం, రెండు రాష్ట్రాల మధ్య భూసేకరణ సమస్యకు ఎక్కువ కాలం పడుతుందని , మార్పు చేసిన ఈ కొత్త లైన్ ద్వారా తక్కువ దూరం తక్కువ ఖర్చుతో పూర్తి చేయవచ్చని దీన్ని త్వరగా ఆమోదించాలని కేంద్ర మంత్రిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కోరారు…అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి గారు, గౌరవ కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక, పర్యాటక మంత్రి శ్రీ G. కిషన్ రెడ్డి గారిని ఢిల్లీలో కలసి గండికోట చారిత్రక ప్రాముఖ్యతను వివరిస్తూ, గండికోటను టూరిజం స్పాట్ గా తీర్చిదిద్దెందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్యర్యంలో మరిన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు… ఈ సందర్బంగా మంత్రి కిష న్ రెడ్ది గారు స్పందిస్తూ “స్వదేశీ దర్శన్” అనే పథకం ద్వారా 70 – 80 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.. అలాగే దాల్మియా సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి CSR ద్వారా మరి కొంత నిధులు దీనికే కేటాయిస్తామని అని పేర్కొన్నారు…అలాగే మంత్రి గారికి సిద్దవటం కోట యొక్క చారిత్రక ప్రాముఖ్యతను తన లేఖ ద్యారా వివరిస్తూ, ఇటీవల భారీ వర్షాల సమయంలో సిద్దవటం కోటలోని పురాతన స్మారక చిహ్నాలు మరియు ప్రహరీ గోడలు చాల వరకు దెబ్బతిన్నాయని తెలియచేస్తూ, పురాతన స్మారక చిహ్నాల పరిరక్షణ కోసం ,ప్రహరీ గోడల పునరుద్దరణ కొరకు తక్షణం చర్యలు తీసుకోవాలని, తద్వారా సిద్దవటం కోట యొక్క చారిత్రక ప్రాముఖ్యతను, భవిష్యత్తు తరాలకు తెలియజేసేందుకు సహకరించవలసినదిగా కోరారు…..

* నెల్లూరు ; మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ వ్యవహారంపై స్పందించిన మాజీ మంత్రి అనీల్..

ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ జరగలేదు..

ఎమ్మెల్యే కోటం రెడ్డికి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్..

ఇద్దరం ఎమ్మెల్యే పదవులకు స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసి స్పీకర్ దగ్గర వెళ్తాం..

ఫోన్ టాపింగ్ జరిగిందని నువ్వు నిరూపిస్తే నేను రాజీనామాను యాక్సెప్ట్ చేస్తా.

ఫోన్ టాపింగ్ జరగలేదని నేను నిరూపిస్తే నువ్వు రాజీనామా యాక్సెప్ట్ చేస్తావా..

24 గంటలు సమయం ఇస్తున్నా.. మీరు ఎప్పుడైనా రండి. నేను రెడీ..

తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకే జగన్మోహన్ రెడ్డి పై శ్రీధర్ రెడ్డి ఇలాంటి విమర్శలు చేస్తున్నాడు..

జనవరి 27న ఎమ్మెల్యే కోటంరెడ్డి కి టిడిపి టికెట్ కన్ఫామ్ అయ్యింది.

పార్టీని వీడే సందర్భం వచ్చింది కాబట్టి ఆయన ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చాడు.

ఆనం రామనారాయణ రెడ్డి చచ్చిన పాము.. ఆయన కేంది ప్రాణాహాని..

*శ్రీధర్ రెడ్డి ఫోన్ టాపింగ్ జరిగిందని కేవలం 16 సెకండ్ల ఆడియో మాత్రమే రిలీజ్ చేశాడు..

మీడియాకు ఫోన్లో చూపించిన ఆడియో 51 సెకండ్ లు ఉంది..

శ్రీధర్ రెడ్డికి దమ్ముంటే 51 సెకండ్ల వీడియో బయట పెట్టాలి..

51 వీడియో బయట పెడితే శ్రీధర్ రెడ్డి బాగోతం మొత్తం బయటపడుతుంది

* తెలంగాణకు బడ్జెట్ ద్వారా వచ్చింది జీరో’ కేంద్రం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించలేదని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘తెలంగాణకు బడ్జెట్ ద్వారా వచ్చింది జీరో’ అని హైదరాబాద్లోని కొన్ని చోట్ల భారీ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.