NRI-NRT

ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.10 లక్షలు స్వాహా..

ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను మోసం చేసిన సైబర్ నేరగాళ్లు.. రూ.10 లక్షలు స్వాహా..

ఓ ఎన్నారై సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ.10 లక్షల పోగొట్టుకున్నాడు. నిందితులు బాధితుడిని అతని మొబైల్ ఫోన్‌లో సంప్రదించి అతని ఏటీఎం కార్డు వివరాలను రాబట్టి అతని మొబైల్ ఫోన్‌కు ఫిషింగ్ లింక్‌ను పంపి డబ్బును అపహరించారు. మోసపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

తల్లిని చూసేందుకు బద్రీ నారాయణన్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన తల్లిని చూసేందుకు విరుగంబాక్కంలోని తన ఇంటికి వచ్చాడు. బుధవారం విరుగంబాక్కం సమీపంలోని ఏటీఎంకు వెళ్లిన నారాయణన్ అక్కడ రెండుసార్లు పిన్‌ను తప్పుగా నమోదు చేయడంతో అతని కార్డు బ్లాక్ అయిందని పోలీసులు తెలిపారు. ఇంటికి తిరిగి రాగానే గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చింది.

ఖాతా, కార్డు వివరాలు గుర్తు తెలియని వ్యక్తి తాము బ్యాంకు కస్టమర్ కేర్ విభాగానికి చెందినవారిమని, మీ ఖాతా, కార్డు వివరాలను ఇవ్వాలని నారాయణన్ అడిగారు. తక్షణమే వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని కోరారు. నారాయణన్ ఏటీఎం కార్డు బ్లాక్ కావడం, కస్టమర్ కేర్ నుంచి ఫోన్ రావడాన్ని నమ్మిన్ బాధితుడు వెంటనే ఖాతా, డెబిట్ కార్డ్ వివరాలను చెప్పాడు. కాల్ చేసిన వ్యక్తి నారాయణన్ ఫోన్‌కి లింక్ కూడా పంపాడు. నారాయణన్ లింక్‌ను క్లిక్ చేయడంతో, అతని ఖాతా నుంచి మూడు విడతలుగా మొత్తం 10 లక్షలు డెబిట్ అయ్యాయి.

చదువుకున్న వారు కూడా.. నారాయణ్ వెంటనే బ్యాంక్ కు వెళ్లాడు. బ్యాంకు అధికారులకు విషయం వివరించగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. నారాయణ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదువుకుని, విదేశాల్లో ఉద్యోగం చేస్తూ.. ఇలా మోసపోవడంపై పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు. అందుకే అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన ఎలాంటి లింక్ లను క్లిక్ చేయ్యొద్దని కోరారు.