Politics

జగన్‌తో నాకు అక్కడే గ్యాప్ వచ్చింది..

జగన్‌తో నాకు అక్కడే గ్యాప్ వచ్చింది.. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని సీట్లొస్తాయంటే: మాజీ మంత్రి

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌తో ఎందుకు గ్యాప్ వచ్చింది.. టీడీపీలో ఎలా చేరారో వివిరించారు. 2019 ఎన్నికల తర్వాత బీజీపీలోకి వెళ్లడంపైనా స్పందించారు. 2024 ఎన్నికలపై తన అభిప్రాయాలను కూడా చెప్పుకొచ్చారు. తాను మాత్రం బీజేపీని వీడేది లేదని తేల్చి చెప్పారు. కుదిరితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని.. పోటీ చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇదంతా కుదరకపోయినా సరే పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు.

ప్రధానాంశాలు:

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
జగన్‌తో గ్యాప్ రావడం, టీడీపీలో చేరడంపై వివరణ
వచ్చే ఎన్నికలపై అభిప్రాయాలను కూడా చెప్పారు

గతంలో జగన్‌కు కొన్ని సలహాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి. తాను ఆయనతో చాలా సన్నిహితంగా ఉండేవాడిని అన్నారు. తనకు జగన్‌తో పట్టిసీమ విషయంలో గ్యాప్ పెరిగిందన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను పట్టిసీమ మంచిదంటే.. జగన్ మాత్రం పార్టీపరంగా చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది కదా అంటారని.. పట్టిసీమ నీళ్లు ఆంధ్రాకు వస్తే.. కృష్ణాజలాలు సీమకు వాడుకోవచ్చు కదా తాను వ్యాఖ్యానించినట్లు చెప్పుకొచ్చారు. అప్పుడు జగన్ కూడా ‘చంద్రబాబు ఓడితే కదా మనం గెలిచేది’ అని తనతో అన్నారని ఆదినారాయణ రెడ్డి వివరించారు. అప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి అన్నారు

ఆ తర్వాత చంద్రబాబు నుంచి తనకు రాయబారం వచ్చిందని.. ముందు లోకేష్‌తో మాట్లాడాను అన్నారు. తనకు సార్ అంటే పిలవడమంటే నచ్చదని.. లోకేష్ కూడా పేరు పెట్టి పిలిచినా అభ్యంతరం లేదని తనతో చెప్పారన్నారు. ఆ తర్వాత తనను మళ్లీ వైఎస్సార్‌సీపీలోకి వస్తారా అంటే రానని చెప్పానన్నారు. తాను టీడీపీని వీడే సమయంలో చంద్రబాబు కూడ చెప్పానన్నారు ఆది. బీజేపీతో వైరం తెచ్చుకోవద్దు.. సీట్లతో పాటు, ఇంకా ఏదైనా ఇవ్వాలంటే బీజేపీకి ఇవ్వమని తాను సలహా ఇచ్చానన్నారు. కానీ ఇప్పుడు ఆయన కంటే రాష్ట్రం బాగా నష్టపోయిందని.. చెప్పినా వినని పరిస్థితుల్లో ఆయన ఆధ్వరంలో పరుగెత్తినా పని జరగదనే బీజేపీలో చేరాను అన్నారు.

వైఎస్ వివేకా హత్య కేసులో.. తాను బీజేపీలో చేరాక కూడా సిట్‌తో 2గంటలు ప్రశ్నించారన్నారు. సీబీఐ తనను విచారణ కోసం పిలవలేదని.. ఒకవేళ పిలిస్తే తనకు తెలిసింది చెబుతానన్నారు. మొదటి రోజే ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎన్‌కౌంటర్‌ చేయాలని కోరానని గుర్తు చేశారు. వివేకా కేసులో తన పాత్ర ఉందని టార్గెట్ చేశారని.. తాను వంద శాతం చేశానని కూడా నమ్మామని తనతో చెప్పారన్నారు. తన ఓటమికి అదే ప్రధాన కారణమన్నారు. టీడీపీ దగ్గర దగ్గర 50 సీట్లలో ఓడిపోవడానికి వివేకా హత్య కారణం అన్నారు. గతంలో బాగా నమ్మారని.. ఇప్పుడు చాలా బాగా రియలైజ్ అవుతున్నారన్నారు.

తాను పార్టీ మారాలని భావించడం లేదన్నాు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోరాటం చేస్తే సులభమవుతుందని ఆలోచనగా చెప్పుకొచ్చారు. పార్టీ నాయకత్వం ఒప్పుకోకుంటే బీజేపీలో ఉండే పోరాడతాను అన్నారు. పవన్‌ కళ్యాణ్‌ను నాయకుడిగా ఉంచి మిగిలినవాళ్లను కలుపుకొని ముందుకు పోవాలన్నది బీజేపీ ఆలోచన అన్నారు. పొత్తులు కుదురుతాయన్న ఆశతో ఉన్నానని.. ఒకవేళ కుదరకున్నా బీజేపీని వీడను అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్2సీపీకి 175లో 60 వస్తే గొప్ప అన్నారు.