Politics

ఇక చకచకా అమెరికా వీసాలు

ఇక చకచకా అమెరికా  వీసాలు

అదో మహా సౌధం.. శత్రు దుర్భేద్యం.. పచ్చదనానికి పెద్దపీట..

12.2 ఎకరాల ప్రాంగణం. రూ.2,251 కోట్ల నిర్మాణ వ్యయం..

లోని అమెరికన్ కాన్సులేట్ సొంత భవన సముదాయం హైదరాబాద్

అదో మహా సౌధం.. దుర్భేద్యం.. పచ్చదనానికి పెద్దపీట.. 12.2 ఎకరాల ప్రాంగణం. రూ.2,251 కోట్ల నిర్మాణ వ్యయం..

హైదరాబాద్ లోని అమెరికన్ కాన్సులేట్ సొంత భవన సముదాయం ప్రత్యేకతలివి. ఈ ఏడాది నవంబరు నుంచి సొంత ప్రాంగణంలో కార్యకలాపాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల వీసా అపాయింట్మెంట్స్ సంఖ్య, ఇంటర్వ్యూ కేంద్రాల (విండోస్) సంఖ్య పెరగనుంది. వీసా ఆమోదం తరవాత పాస్పోర్టు తిరిగి ఇచ్చే వ్యవధి మరింత తగ్గనుంది. హైదరాబాద్ లోని పాయిగా ప్యాలెస్ 2008 నుంచి ఈ కాన్సులేట్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. నానర్ధాంగూడలో సొంత భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 12.2 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. మూడేళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. దీని గురించి హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ అధికార ప్రతినిధి డేవిడ్ మోయర్ ‘ఈనాడు’ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.

కొత్త ప్రాంగణం వల్ల వీసా దరఖాస్తుదారులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

ఇంటర్వ్యూ కేంద్రాలు అదనంగా 40 వరకు పెరుగుతాయి. ఇంటర్వ్యూల కోసం అనుమతించే దరఖాస్తుదారుల సంఖ్య కూడా పెరుగుతుంది. వీసా జారీ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేసేందుకు 225 డెస్క్ లు ఏర్పాటు చేస్తున్నాం. దరఖాస్తుదారుల కోసం సదుపాయాలు విస్తరిస్తాం.

మూడేళ్లుగా నిర్మాణం సాగుతోంది కదా?

[11:06 am, 15/03/2023] Shaik Tihirinabegum: అమెరికా నిర్మాణ రంగ ప్రమాణాల మేరకు జరుగుతోంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఓవర్సీస్ బిల్డింగ్స్ ఆపరేషన్ విభాగం నమూనాల నుంచి నిర్మాణ ప్రమాణాల వరకు అన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తుంది. సాధారణ భవనం కన్నా 50 శాతం విద్యుత్తు వినియోగం తగ్గేందుకు వీలుగా మెకానికల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. 81.72 శాతం మేరకు నీటి వినియోగం తగ్గుతుంది. వర్షపు నీటిని అందిపుచ్చుకునేందుకు వీలుగా జల సంరక్షణ వ్యవస్థ ఉంటుంది.

నిర్మాణ వ్యయం ఎంత?

నిర్మాణానికి అమెరికా ప్రభుత్వం రూ.2.251 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రధాన భవనం 17,917 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి ప్రకృతి సిద్ధమైన పచ్చదనం కనిపిస్తుంది. ఇక్కడ సహజసిద్ధంగా ఉన్న రాళ్లను (డక్కన్ రాక్ ఫార్మేషన్) యథాతథంగా పరిరక్షిస్తున్నాం.

కరోనా తరవాత వీసా ప్రక్రియను వేగవంతం చేశారా?

సాధ్యమైనంత మేరకు వేగవంతం చేస్తున్నాం. వీసా ఇంటర్వ్యూ కోసం ఎంత కాలం వేచి ఉండాలన్నది ప్రతి వారం https://travel.state.gov/content/travel/en/us- visas/visa-informationresources/ wait-times.html

వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నాం. వేచి ఉండే వ్యవధిని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.