Agriculture

ఐఎండీ తాజా వార్నింగ్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఐఎండీ తాజా వార్నింగ్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణం పూర్తిగా మారిపోయింది.. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు..

రాబోవు మూడు రోజుల రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండబోతోందనే వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది.. ఇక, శనివారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని.. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.. ఇక, ఆదివారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ డాక్టర్‌ బీఆర్ అంబేద్కర్ ఓ ప్రటనలో పేర్కొన్నారు.