Food

ఇది ఒక్క పండు తింటే కిడ్నీలో ఎంతటి రాళ్లైనా కరిగి బయటకు రావాల్సిందే….

ఇది ఒక్క పండు తింటే కిడ్నీలో ఎంతటి రాళ్లైనా కరిగి బయటకు రావాల్సిందే….

ఈరోజు మనం ఒక అద్భుతమైన గురించి తెలుసుకుందాం, ఇవి అనేక అంతుపట్టని రోగాలని అయినా సరే ఇట్లే నయం చేస్తాయి. మన శరీరానికి అద్భుతంగా విటమిన్ C నీ అందించి మన ఇమ్యూనిటీ పవర్ ను అద్భుతంగా పెంచుతాయి. ఆ కాయలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ భూమి మీద ఎన్నో మొక్కలు, కాయలు మన ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతున్నాయి, వాటిని సీజనల్గా తింటూ మానవులు ఎన్నో లాభాలను పొందుతున్నారు, అలాంటి కాయలలో చిన్న కలే కాయలు ఒకటి. వీటిని కొన్ని ప్రాంతాలలో చిన్న వాక్కాయలు అంటారు.

మన తెలుగు రాష్ట్రాలలో అన్ని ప్రాంతాలలో చెట్ల అడవుల్లో, కొండ ప్రాంతాలలో, పొలాల ప్రక్కన సహజ సిద్ధంగా ఈ చెట్లు పెరుగుతాయి. అడవుల్లో సహజసిద్ధంగా పెరిగే ఈ మొక్కల నుండి పండ్లు వానాకాలంలో కొన్ని రోజులు మాత్రమే లభిస్తాయి, ఇది ఈ సీజన్లో బాగా లభిస్తాయి పూర్వం పిల్లలు చిన్న కళే కాయలను సెలవు రోజుల్లో సేకరించుకొని ఎంతో ఇష్టంగా తినేవారు. ఈ సీజన్లో మాత్రమే లభించే ఈ పండ్లను తినడం వల్ల మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి, వీటిని పిల్లలు తినడం వల్ల ఇవి వారి ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ కాయలను తుంచితే పాలు కారుతాయి వీటినే పచ్చిగా లేదా పండిన తర్వాత తినవచ్చు, వీటిని తింటే జలుబు చేస్తుంది అనే ఒక అపోహ ఉంది.

కానీ అందులో ఏమాత్రం నిజం లేదు, ఇవి వర్షాకాలంలో వస్తాయి కాబట్టే సాధారణంగా అందరికీ ఈ సీజన్లో జలుబు చేస్తుంది, అదే సమయంలో వీటిని తినడం వల్ల వీటి వల్లే జలుబు చేసింది అని అందరూ అనుకుంటారు, నిజానికి జలుబు నైనా తగ్గించే శక్తి కలే కాయలకు ఉంది. ఇందులో ఉండే విటమిన్ సి మనకు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఇవి పచ్చిగా ఉన్నప్పుడు పుల్లగా పండిన తర్వాత తీయగా ఉంటాయి. వీటిని తింటే మూత్రపిండాల్లో రాళ్లను కరిగించి మూత్రం ద్వారా పోయేలా చేస్తాయి, అంతేకాదు మూత్ర నాలాలను శుభ్రపరుస్తాయి ఈ చిన్న కళే కాయలు వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులను మన శరీరంలోకి ప్రవేశించకుండా మనల్ని కాపాడతాయి. ప్రస్తుత రోజుల్లో అంతు పట్టని వైరస్ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంది, మరియు దీని బారిన పడే ఎంతోమంది బాధపడ్డారు ఇలాంటి వైరస్ ను తరిమికొట్టే శక్తి ఈ కాయలకు ఉంది. ఈ సీజన్లో వీటిని తింటే మన ఇమ్యూనిటీ పవర్ ను అద్భుతంగా పెంచుతుంది, ఎటువంటి వ్యాధులు రాకుండా తట్టుకునే శక్తి మన శరీరానికి వస్తుంది.

కలే కాయలపై పరిశోధన చేసిన జర్మనీ పరిశోధకులు ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయని కనుగొన్నారు, ఈ కాయలలో ఫైటో నూట్రియన్స్, ఫినోలిక్ ఆమ్లం అధికంగా ఉంటాయని మరియు ఇందులో ఉండే ఫ్లావనాయిడ్స్, పాలిఫినైల్స్ మన శరీరంలో కణాలు దెబ్బతినకుండా మరియు ఇన్ఫెక్షన్స్ కు గురి అవ్వకుండా కాపాడుతాయని వారి పరిశోధనలో వెల్లడయింది. వీటిని ఈ సీజన్లో తినడం వల్ల రక్తనాళాల్లో రక్తం ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరుగుతుంది, తద్వారా గుండె సంబంధిత రోగాలు తగ్గుతాయి, గుండెకు ఎంతో బలాన్ని ఇస్తాయి. కలే కాయల రసాన్ని నీటిలో కలిపి తాగితే హార్మోన్స్ సక్రమంగా విడుదల అవుతాయి, అంతేకాదు మూత్రపిండాలు సక్రమంగా పనిచేయడంలో కలే కాయల రసం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వీటిని ఈ సీజన్లో తినడం వల్ల క్యాన్సర్ రాకుండా మనల్ని కాపాడుతాయి, ఊపిరితిత్తులు మరియు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి, వీటిని నమిలి తినడం వల్ల దంతాలు స్ట్రాంగ్ గా మారుతాయి, దంతాలు పుచ్చిపోవడాన్ని ఆపి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి, నోటి నుండి తాజా సువాసన వచ్చేలా చేస్తాయి, బరువు తగ్గాలి అనుకునేవారు ఈ సీజన్లో లభించే వీటిని తినడం వల్ల సహజసిద్ధంగా బరువు తగ్గుతారు. మన చర్మం లో అంతర్గత రక్తస్రావాలు అవుతుంటే ఈ పండ్లను ఈ సీజన్లో తింటే తగ్గుతాయి, విటమిన్ సి లోపం ఉన్నవారు ఈ సీజన్లో వీటిని తినడం చాలా మంచిది.