NRI-NRT

బహ్రెయిన్ లో మురళీధరన్ కు విన్నపం

బహ్రెయిన్ లో మురళీధరన్ కు విన్నపం

జీవితాంతం గల్ఫ్ దేశాలలో పని చేసి స్వదేశానికి తిరిగి వెళ్తున్న అనేక మంది విషయంలో ప్రవాసీయులు ఇబ్బందులకు గురవుతున్నారని బహ్రెయిన్ లోని తెలంగాణ సామాజిక ప్రముఖుడు వెంకట స్వామి విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ కు ఫిర్యాదు చేసారు.

రెండు రోజుల బహ్రెయిన్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి గురు, శుక్రవారాలలో ప్రవాసీ ప్రముఖులతో సమావేశం కావడంతో పాటు వివిధ ప్రవాసీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాకు చెందిన వెంకట స్వామి తెలుగు రాష్ట్రాలతో సహా ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయులు తమ జీవితంలో ఎక్కువ భాగం ఎక్కువ గల్ఫ్ లో గడిపి విదేశీ మారకం పంపడం ద్వార జాతికు మేలు చేకూరుస్తున్నారని మంత్రికు గుర్తు చేసారు.

కానీ ఈ ప్రవాసీయులలో కొందరు స్వదేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత వివిధ ఇబ్బందులకు గురవుతున్నారని వీరికి పునరవాసం కల్పించె దిశగా కేంద్రం కసరత్తు చేయాలని వెంకట స్వామి మంత్రికు విజ్ఞప్తి చేస్తూ వీరికి నెలసరి ఫించను సౌకర్యం కల్పించాలని కోరారు.