NRI-NRT

అద్భుతంగా సాగిన నాట్స్ సంబరాల తొలిరోజు

అద్భుతంగా సాగిన నాట్స్ సంబరాల తొలిరోజు

న్యూజెర్సీ ఎడిసన్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 7వ అమెరికా తెలుగు సంబరాల తొలిరోజు అద్భుతంగా, వైవిధ్యభరితంగా సాగింది. బ్యాంక్వెట్ విందుతో ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి పురస్కారాలు అందజేశారు. తానా, ఆటా, మాటా, నాటా తదితర ప్రవాస తెలుగు సంఘల ప్రతినిధులు పాల్గొని తమ సందేశాన్ని వినిపించారు.


చిత్ర, వాణిజ్య, ఆధ్యాత్మిక, వ్యాపార, క్రీడా, సాహితీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. సమన్వయకర్త అప్పసాని శ్రీధర్, అధ్యక్షుడు నూతి బాపులు అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

పురస్కారాలు అందుకున్న వారిలో తమ్మన నిహాల్, డా.ముసునూరి శైలజ, పోచిరాజు సత్యవతి, డా. దేవిశెట్టి బాల, బాలాజీ ప్రకాశరావు తదితరులు ఉన్నారు.