WorldWonders

కిలో మామిడి పండ్లు ధర 2.75 లక్షలు….

కిలో మామిడి పండ్లు ధర 2.75 లక్షలు….

కిలో మామిడి పండ్లు రూ.2.75 లక్షల ధర పలికాయి. వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా అదే నిజం. పశ్చిమబెంగాల్లో ఈ మామిడి అమ్మకానికి వచ్చింది. ప్రస్తుతం సిలిగుడి జిల్లా మటిగరా మాల్‌లో మామిడి పళ్ల ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా మొత్తం 262 రకాల పళ్ల(262 Items)ను ప్రదర్శనకు ఉంచారు.అయితే వియాజాకీ రకం మామిడే ఆ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ రకం మామిడి పండ్ల ధర కిలోకు ఏకంగా రూ. 2.75 లక్షలు పలకడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సాధారణ పండ్ల కంటే ఈ మామిడి పండ్ల పరిమాణం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా ఈ మామిడి పండ్లలో తీపి శాతం కూడా ఇతర రకాల పండ్ల కంటే 15 శాతం అధికంగా ఉంటుంది.వియాజాకీ రకం మామిడి పండు గరిష్ఠ బరువు 900 గ్రాముల వరకూ ఉంటుంది. మియాజాకీ రకం మామిడిని భారత్ సహా పలు ఆసియా దేశాల్లో ఇప్పటికీ సాగు చేస్తూ వస్తున్నారు. ఈ పండ్లు మొదట్లో జపాన్‌లోని వియాజాకీ నగరంలో బయటపడటంతో వీటికి ఈ పేరు వచ్చినట్లు చెబుతున్నారు. ఇంత భారీ ధర పలికిన ఈ పండ్లను చూసేందుకు స్థానికులు క్యూకడుతున్నారు.