NRI-NRT

పిట్స్‌బర్గ్‌లో ఎన్టీఆర్ జయంతి….

పిట్స్‌బర్గ్‌లో ఎన్టీఆర్ జయంతి….

పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌ నగరం డిస్కవరీ చర్చి ప్రాంగణంలో ఎన్టీఆర్‌ శతజయంతిని పురస్కరించుకొని ‘తెలుగువారి ఆత్మగౌరవానికి వందేళ్ళు’ పేరిట వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాదాపు 250 మందికి పైగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగువారికి ఎన్టీఆర్‌ తెచ్చిన గుర్తింపును వక్తలు గుర్తు చేశారు. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కులు కల్పించే క్రమంలో ఆ మార్పును తన సొంత ఇంటి నుంచే ప్రారంభించడం ఎన్టీఆర్‌ గొప్పతనానికి నిదర్శనమని అక్కడి మహిళలు అభిప్రాయపడ్డారు.

‘సినీ, రాజకీయ రంగంలో ఎన్టీఆర్‌ వేసిన ప్రతి అడుగూ ఓ సంచలనమే. ఆయన జీవిన విధానం ఎప్పటికి స్ఫూర్తిదాయకమే’ అని గురజాల మాల్యాద్రి, శారదాదేవి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ చేపట్టిన వినూత్న కార్యక్రమాలను, నిర్ణయాలను, తమ రాజకీయ జీవితాలపై ఆయన ప్రభావం తదితర విషయాలను తెదేపా నేతలు గౌతు శిరీష, గద్దె రామోహన్, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ఏలూరి సాంబశివరావు, అడుసుమిల్లి శ్రీనివాసరావు, లింగమనేని శివరామప్రసాద్, కొమ్మారెడ్డి పట్టాభిరాం తమ వీడియో బైట్స్ ద్వారా గుర్తు చేసుకున్నారు. మూడు గంటలకు పైగా జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.