Health

ఆలస్యంగా నిద్రిస్తే మరణించే ముప్పు

ఆలస్యంగా నిద్రిస్తే మరణించే ముప్పు

రాత్రిపూట ఎక్కువసేపు మేల్కొని ఉంటున్నారా? పొగ, మద్యం కూడా తాగుతున్నారా? జాగ్రత్త! ఇలాంటి అలవాటు గలవారికి మరణించే ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు ఫిన్‌లాండ్‌ పరిశోధకులు గుర్తించారు. పాతికేళ్ల వయసులో ఉన్న సుమారు 23వేల మందిని ఎంచుకొని.. 37 ఏళ్లకు పైగా పరిశీలించి మరీ ఈ విషయాన్ని కనుగొన్నారు. పెందలాడే పడుకునేవారితో పోలిస్తే ఆలస్యంగా నిద్రించేవారికి ఏ కారణంతోనైనా మరణించే ముప్పు 9% ఎక్కువగా ఉంటున్నట్టు బయటపడింది. వీరంతా 8 గంటల కన్నా తక్కువసేపే నిద్రించటం గమనార్హం. ఈ మరణాలకు చాలావరకు పొగ, మద్యం అలవాట్లే కారణమవుతున్నట్టూ తేలింది. ఏ సమయానికి నిద్రిస్తున్నారనే దాని కన్నా ఈ అలవాట్లే మరణం ముప్పు పెరగటానికి దోహదం చేస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఆయుష్షు విషయంలో జీవనశైలినీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముందని అధ్యయన ఫలితాలు గట్టిగా నొక్కి చెబుతున్నాయి.