DailyDose

రోజుల తరబడి శవానికి స్నానాలు…బట్టలు మార్పిడి

రోజుల తరబడి శవానికి స్నానాలు…బట్టలు మార్పిడి

మాములుగా ఒక జీవి చనిపోయిన తర్వాత కొద్ది రోజులకే శరీర మొత్తం కుళ్లిపోయి పురుగులు పట్టడం ప్రారంభిస్తుంది. మనుషులు కూడా అంతే. అయితే కొన్ని కొన్ని సార్లు మనుషులు చనిపోయినా కూడా పురుగులు పట్టకుండా కొద్ది రోజులు అలాగే ఉండడం కోసం ఐస్ బాక్స్ లో పెడుతూ ఉంటారు. కానీ ఆ ఐస్ బాక్స్ లో తీసిన తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఆ శరీరం కుళ్ళిపోవడం ప్రారంభిస్తుంది. అందుకే మనుషులు చనిపోయిన తర్వాత తొందరగా దహన సంస్కారాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఒక సంఘటన మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం అని చెప్పవచ్చు. అసలేం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్‌ లోని బారాబంకీలో భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక బామ్మ గత 10 రోజులుగా తన 18 ఏళ్ల మనవడి మృతదేహాన్ని తనతోపాటు ఉంచుకుని దానికి ప్రతిరోజూ స్నానం చేయిస్తూ, దుస్తులు మారుస్తూ వస్తోంది. అయితే ఆ మృతదేహం నుంచి వెలువడుతున్న దుర్వాసన చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో, చుట్టు పక్కల వారు పోలీసులకు ఈ సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ ఇంటి తలుపులు తెరిచి చూసి ఒకసారి గా షాక్ అయ్యారు. ఆ బామ్మ తన మనుమడి మృతదేహాన్ని తన దగ్గరే ఉంచుకుంది.ఆ మృతదేహం పురుగులు పట్టి, కుళ్లిపోయిన స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. గదిలో నుంచి విపరీతమైన వాసన బయటికి వస్తోంది. ఆ దుర్వాసనకు పోలీసులకు ఒక్కసారిగా వాంతులు వచ్చేసాయి. కానీ పోలీసులు తమను తాము నియంత్రించుకుని, ముందుగా ఆ బామ్మను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ.. ఆ వృద్ధురాలికి మతిస్థిమితం లేనిదని తెలిపారు. కాగా పోలీసులు ఆ యువకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఆ కుర్రాడు ఎలా మృతి చెందాడనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోహరిపుర్వా ప్రాంతానికి చెందిన 65 ఏళ్ల వృద్దురాలి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితి చూసి షాక్ అయ్యారు. గదిలో ఒక వృద్ధురాలు 18 ఏళ్ల యువకుని మృతదేహానికి సపర్యలు చేస్తూ కనిపించింది. ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఆ వృద్ధురాలిని పోలీసులు ప్రశ్నించగా, తన మునుమడు 10 రోజుల క్రితం చనిపోయాడని తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.