Agriculture

మార్కెట్ లో పెరుగుతున్న కూరగాయల ధరలకు కారణం?

మార్కెట్ లో పెరుగుతున్న  కూరగాయల ధరలకు కారణం?

మార్కెట్లో కూరగాయల  ధరలు మండిపోతున్నాయి. కనీసంగా కిలో 60 నుంచి 120 వరకూ ఖర్చుచేసి కొనుగోలు చేయాల్సివస్తోంది. రూ.500 తీసుకెళ్తే ఐదారు రకాలు తెచ్చుకోవడం కష్టంగా మారింది. అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణం అనుకూలించని కారణంగా స్థానికంగా కూరగాయల ఉత్పత్తి పడిపోయింది. దీంతో వారంలోనే ధరలు అమాంతం ఎగబాకాయి. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్నా అక్కడా ధరలు మండిపోవడంతో ఆ ప్రభావం స్థానిక మార్కెట్లపై పడుతోంది.