Business

జియో సంచలనం

జియో సంచలనం

రిలయన్స్ జియో మరో సంచలనానికి తెర లేపింది.  జియో భారత్ 4G ఫోన్‌ను విడుదల చేసింది. కేవలం రూ. 999 కే ఈ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.  ఇంటర్నెట్ ఎనేబుల్డ్ ఫీచర్ ఫోన్ ఇది. 2023 జూలై 7 నుంచి సేల్స్ ప్రారంభం కానున్నట్లుగా తెలిపింది.ఈ మెుబైల్ పై రూ.123 టారిఫ్ ప్లాన్ ప్రవేశపెట్టింది జియో.   ఇందులో 28 రోజుల వ్యాలిడిటీతో 14 జీబీ డేటా లభిస్తుంది.  దీంతో పాటుగా జియో సినిమా, జియో సావన్, ఎఫ్ ఎం రేడియో వంటి ఎంటర్ టైన్ మెంట్ యాప్స్ కూడా వాడుకోవచ్చు. యూపీఐ పెమెంట్స్ కూడా చేయోచ్చు. ఇతర కంపెనీల ఫీచర్ ఫోన్ల ఆఫర్లతో పోలిస్తే జియో 30 శాతం తక్కువకే అందిస్తోంది. 7 రెట్లు ఎక్కువ డేటా అందిస్తోంది. కొత్తగా లాంచ్ చేసిన జియో భారత్ ఫోన్ ఇతర ఫీచర్ ఫోన్ లాగా కీప్యాడ్  స్క్రీన్‌కి దిగువన కనిపిస్తుంది. వెనుక ప్యానెల్ స్పీకర్లపై కెమెరా కూడా ఉంది.