Business

ఇప్పుడు అందరి చూపు ఈ గోల్డెన్ బుల్లెట్ పైనే

ఇప్పుడు అందరి చూపు ఈ గోల్డెన్ బులెట్ పైనే

మామూలుగా బుల్లెట్ బైక్ పట్ల యువతకు ఎంత క్రేజ్ ఉందో చెప్పక్కర్లేదు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ లలో ఈ బుల్లెట్ ప్రత్యేకం. గోల్డెన్ షెడ్స్ తో ఆకట్టుకుంటోంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది
టూ వీలర్ లలో ప్రతి సారీ ఆటోమొబైల్ కంపెనీలు పలు రకాల కొత్త మోడళ్లతో యువతను ఆకట్టుకొంటాయి. ట్రెండ్ కు తగిన విధంగా కొత్త మోడల్స్ ను డిజైన్ చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తుంటాయి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోదగినది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఈ బైక్ పట్ల యువకుల నుంచి పెద్ద వారి వరకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇటీవల నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తవా డుగ్గు, డుగ్గు, డుగ్గు, డుగ్గు, డుగ్గనీ అంటూ వచ్చిన పాట ఎంత ఫేమస్ అయ్యందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లెట్ బండికి కూడా అంతే క్రేజ్ ఉంది మార్కెట్ లో. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి తన బుల్లెట్ ను బంగారు బుల్లెట్ గా మార్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.
నేటి రోజుల్లో ఎక్కువ మంది సొంత వాహనాలకే ప్రియారిటీ ఇస్తున్నారు. పబ్లిక్, ప్రైవేట్ సంస్థలకు చెందిన వాహనాల్లో ప్రయాణించడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఈ క్రమంలోనే టూ వీలర్ వాహనాల వినియోగం ఎక్కువైపోయింది. అయితే తమకు నచ్చిన బైక్ ను తీసుకుని తమకు కావాల్సిన రీతిలో మాడిఫై చేయిస్తుంటారు బైక్ లవర్స్. ఇదే రీతిలో ఓ వ్యక్తి తన బుల్లెట్ ని బంగారు బుల్లెట్ గా మాడిఫై చేసుకున్నాడు. కానీ ఇది గోల్డెన్ బుల్లెట్ కాదు, గోల్డ్ పెయింట్ స్కీమ్ మాత్రమే పొందింది. ఇది బుల్లెట్ 350 సిసి బైక్. రాయల్ బుల్లెట్ 5577 అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ గోల్డెన్ బుల్లెట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఆ వీడియోలో చూపిన విధంగా బుల్లెట్ బైక్ లోని కొన్ని పార్ట్స్ గోల్డ్ షేడ్స్ తో మాడిఫై చేశారు. హెడ్ ల్యాంప్, సైలెన్సర్, ఫుట్ రెస్ట్, హ్యాండిల్ బార్ ఇలా పలు భాగాలు గోల్డెన్ షేడ్స్ లో ఉన్నాయి. హ్యాండిల్ బార్ పై ఛత్రపతి శివాజీ బొమ్మ కూడా గోల్డ్ షేడ్ లోనే ఉంది. ఈ గోల్డెన్ బెైక్ పూణే ప్రాంతానికి చెందిన సన్నీ వాఘరే అనే వ్యక్తికి సంబంధించినదిగా తెలుస్తోంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.