DailyDose

భర్తను అవహేళన చేసినందుకు విడాకులు మంజూరు చేసిన కోర్టు

Court grants divorce to wife who verbally abused husband

కర్నాటకలో విచిత్రమై కేసు వెలుగు చూసింది. ఓ భార్య తన భర్తను కర్రెగా ఉన్నావంటూ హేళన చేయడంతో.. విడాకులు మంజూరు చేసింది కోర్టు. అంతేకాదు.. భర్తను అవమానించిన మహిళపై తీవ్ర కామెంట్స్‌తో విరుచుకుపడింది ధర్మాసం. ఆమె కామెంట్స్ క్రూరత్వంగా భావించి, విడాకులు మంజూరు చేస్తున్నామని కోర్టు తెలిపింది. ఇందుక సంబంధించిన వివరాలు ఓసారి చూద్దాం.

కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి 2012లో తన భార్య నుంచి విడాకులు కోర్టు బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశాడు. అయితే, కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. దాంతో అతను హైకోర్టును ఆశ్రయించాడు. తాజాగా ఈ కేసును విచారించిన హైకోర్టు ధర్మాసనం.. కీలక కామెంట్స్ చేసింది. వాస్తవానికి హిందూ వివాహ చట్టం ప్రకారం ఒక జంటకు విడాకులు మంజూరు చేయడానికి తొమ్మిది నిర్దేశిత కారణాలు ఉన్నాయి. ఇందులో క్రూరత్వం, వివక్షత ఒకటి. తాజాగా కర్నాటక హైకోర్టు వర్ణవివక్ష వ్యాఖ్యలను క్రూరత్వంగా అభివర్ణించింది. దీని ఆధారంగా విడాకుల కోసం భర్త చేసిన డిమాండ్‌కు సరైనదే అంగీకరించింది. కట్టుకున్న భర్తను కర్రెగా ఉన్నావ్ అంటూ హేళన చేస్తున్న భార్యపై హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. భర్తను నల్లగా ఉన్నావని పిలవడం దారుణం అని హైకోర్టు తీర్పు వెలువరించింది. దాంతో విడాకులు కోరుతూ భర్త వేసిన పిటిషన్‌కు హైకోర్టు ఆమోదం తెలిపింది.

ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం కొన్ని కీలక కామెంట్స్ చేసింది. భర్త నుంచి దూరం కావడం, అక్రమ సంబంధం ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం కూడా దారుణమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రస్తుత విడాకుల చట్టంలో క్రూరత్వం ప్రధాన కారణాలలో ఒకటి అని, నలుపు రంగు కారణంగా భర్తను భార్య అవమానించడం క్రూరత్వంతో సమానమని హైకోర్టు తీర్పులో పేర్కొంది. భర్త విడాకుల పిటిషన్‌ను ఆమోదిస్తూ భార్య ప్రవర్తనను తప్పుపడుతూ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ అనంత్ రామ్‌నాథ్ హెగ్డే తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

రికార్డులో ఉన్న సాక్ష్యాలను నిశితంగా పరిశీలించిన ధర్మాసనం.. నల్లగా ఉన్న కారణంగా భార్య తన భర్తను కించపరిచేదని నిర్ధారణకు వచ్చింది. ఎలాంటి కారణం లేకుండానే ఆమె తన భర్తకు దూరమైందని, ఈ అంశాన్ని దాచిపెట్టడంతోపాటు భర్తకు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ తప్పుడు ఆరోపణలు చేసినట్లు గుర్తించారు. ఇవన్నీ క్రూరత్వానికి నిదర్శనంగా పేర్కొన్న ధర్మాసనం.. విడాకులు మంజూరు చేసింది.

కింది కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేసిన భర్త..
తన చర్మం రంగు ఆధారంగా భార్య తనను నిరంతరం అవమానిస్తుందంటూ.. తనను విడిచి వెళ్లిందంటూ హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13 (i) (a) ప్రకారం విడాకులు కోరుతూ బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు భర్త. అయితే, ఈ పిటీషన్‌ను ఫ్యామిలీ కోర్టు కొట్టివేయగా.. తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. భర్త నిర్ణయాన్ని సమర్థిస్తూ, విడాకులు మంజూరు చేసింది.