Politics

గన్నవరం నుంచి ఖమ్మం బయల్దేరిన అమిత్ షా

గన్నవరం నుంచి ఖమ్మం బయల్దేరిన అమిత్ షా

అమిత్‌షా ఖమ్మం సభ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఖమ్మం సభకు బీజేపీ పెట్టిన పేరు రైతు గోస-బీజేపీ భరోసా. మరి, రైతాంగానికి అమిత్‌ షా ఎలాంటి భరోసా కల్పించబోతున్నారు. రైతాంగాన్ని ఆకట్టుకోవడానికి ఎలాంటి పథకాలు ప్రకటించబోతున్నారు. రాజకీయ విమర్శలు సరే… అసలు, తెలంగాణ ప్రజానీకాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.అధికార బీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆల్రెడీ రైతు డిక్లరేషన్లు ప్రకటించేశాయ్‌. మళ్లీ అధికారంలోకి వస్తే రైతుల కోసం ఏం చేయబోతోందో చెప్పేసింది బీఆర్‌ఎస్‌. ఇక, కాంగ్రెస్‌ కూడా అధికారంలోకి వస్తే… ఏం చేస్తుందో రైతు డిక్లరేషన్‌ ద్వారా ప్రకటించేసింది. మరి, బీజేపీ ఎలాంటి పథకాలు తీసుకురాబోతోంది.