Business

విజ‌య‌వాడ డివిజ‌న్ లో మ‌ళ్లీ రైళ్ల ర‌ద్దు

విజ‌య‌వాడ డివిజ‌న్ లో మ‌ళ్లీ రైళ్ల ర‌ద్దు

విజ‌య‌వాడ డివిజ‌న్ లో మ‌ళ్లీ రైళ్ల ర‌ద్దు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. టెక్నిక‌ల్ కార‌ణాల‌తో ప‌దేప‌దే రైళ్లు ర‌ద్దు చేస్తున్నారు. ర‌ద్ద‌యిన‌,దారి మ‌ళ్లించిన రైళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ద‌క్షిణ మ‌ధ్య రైల్వే లో పెద్ద డివిజ‌న్ గా ఉన్న విజ‌య‌వాడ డివిజ‌న్ లో ఈ మ‌ధ్య త‌ర‌చుగా రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్నారు అధికారులు.విజ‌య‌వాడ మీదుగా న‌డిచే దూర‌ప్రాంత స‌ర్వీసులు నిత్యం ఆల‌స్యంగా న‌డుస్తూ ప్ర‌యాణికుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి.దీనికి తోడు విజ‌య‌వాడ డివిజ‌న్ లో ఈ మ‌ధ్య త‌ర‌చుగా రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్నారు అధికారులు.దీంతో ప్ర‌యాణికుల‌కు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.తాజాగా మ‌రికొన్ని రైళ్ల‌ను ర‌ద్దు చేయ‌డంతో పాటు కొన్ని దూర‌ప్రాంత స‌ర్వీస్ ల‌ను దారి మ‌ళ్లించారు. ప్రయాణికులు రైళ్ల రద్దు, దారి మళ్లింపును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

టెక్నిక‌ల్ కార‌ణాల‌తో ప‌దేప‌దే రైళ్లు ర‌ద్దు చేస్తున్న ద‌క్షిణ మధ్య రైల్వే

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలోని విజ‌య‌వాడ డివిజ‌న్ అత్యంత కీల‌క‌మైన‌ది.అంతేకాదు ఎక్కువ ఆదాయాన్నిచ్చే డివిజ‌న్ కూడా ఇదే.అయితే ఇటీవ‌లే విజ‌య‌వాడ నుంచి బ‌య‌లుదేరే ప‌లు స‌ర్వీస్ ల‌ను రామ‌వ‌రప్పాడు నుంచి న‌డిపారు,కొన్ని స‌ర్వీస్ ల‌ను ర‌ద్దు చేసారు.దీంతో ప్ర‌యాణికులు తీవ్ర అసౌక‌ర్యానికి గుర‌వుతున్నారు.రైళ్ల ర‌ద్దు,దారిమళ్లింపుకు సాంకేతిక కార‌ణాలే కార‌ణ‌మంటున్నారు అధికారులు.సిగ్న‌లింగ్ ప‌నులు,ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉండ‌టం,ట్రాక్ లు మార్పు వంటి కార‌ణాల‌ను ఎక్కువ‌గా చూపుతూ రైళ్ల‌ను ర‌ద్దు చేస్తున్నారు.తాజాగా ట్రాఫిక్ బ్లాక్ దృష్ట్యా కొన్ని రైళ్ల‌ను ర‌ద్దు చేసి,మ‌రికొన్నింటిని దారి మ‌ళ్లించారు.

ర‌ద్ద‌యిన‌,దారి మ‌ళ్లించిన రైళ్ల లిస్ట్ ఇదిగో

*పూర్తిగా ర‌ద్ద‌యిన రైళ్లు.

17239/17240 గుంటూరు – విశాఖ ప‌ట్నం(ఆగ‌స్ట్ 28 నుంచి సెప్టెంబ‌ర్ 4 వ‌ర‌కూ ర‌ద్దు)

22701/ 22702 విజ‌య‌వాడ – విశాఖ‌ప‌ట్నం(ఆగ‌స్ట్ 28,29,30,సెప్టెంబ‌ర్ 1 మ‌రియు 3 వ తేదీల్లో ర‌ద్దు)

07977 / 07978 విజ‌య‌వాడ – బిట్ర‌గుంట‌(ఆగ‌స్ట్ 27నుంచి సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కూ ర‌ద్దు)

07466 / 07467 రాజ‌మండ్రి – విశాఖ ప‌ట్నం (ఆగ‌స్ట్ 28 నుంచి సెప్టెంబ‌ర్ 3 వ తేదీ వ‌ర‌కూ ర‌ద్దు)

17237 / 17238 బిట్ర‌గుంట‌- చెన్సై సెంట్ర‌ల్( ఆగ‌స్ట్ 28 నుంచి సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కూ ర‌ద్దు)

17267 / 17268 కాకినాడ పోర్ట్ – విశాఖ ప‌ట్నం(ఆగ‌స్ట్ 28 నుంచి సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కూ ర‌ద్దు)

07500 విజ‌య‌వాడ – గూడూరు (ఆగ‌స్ట్ 28 నుంచి సెప్టెంబ‌ర్ 3 వ‌ర‌కూ ర‌ద్దు)

07458 గూడూరు – విజ‌య‌వాడ‌(ఆగస్ట్ 29 నుంచి సెప్టెంబ‌ర్ 4 వ‌ర‌కూ ర‌ద్దు)

* విజ‌యవాడ నుంచి గుడివాడ‌,భీమ‌వ‌రం టౌన్ ,నిడ‌ద‌వోలు మీదుగా దారి మ‌ళ్లించిన రైళ్లు.

– 13351 ధ‌న్ బాద్ – అలెప్పి (ఆగ‌స్ట్ 29,సెప్టెంబ‌ర్ 1,2,5,8,9 తేదీల్లో మ‌ళ్లింపు)

– 12835 హ‌తియా – బెంగ‌ళూరు (ఆగ‌స్ 29,సెప్టెంబ‌ర్ 5 వ‌ర‌కూ మ‌ళ్లింపు)

– 18637 హ‌తియా – బెంగ‌ళూరు(సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కూ మ‌ళ్లింపు)

– 12889 టాటా – బెంగ‌ళూరు(సెప్టెంబ‌ర్ 8,సెప్టెంబ‌ర్ 15)