నంద్యాలలోని మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున ఎంప్లాయిస్ కాలనీ ఈశ్వర నగర్ టోల్ గేట్ ప్రాంతంలో సంచరించింది ఎలుగుబంటి. దీంతో ఒకరికొకరు ఫోన్లు చేసుకుని అప్రమత్తమయ్యారు స్థానికులు. ఈ తరుణంలోనే.. ఎలుగుబంటి సంచారాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరించారు స్థానికులు.ఎలుగుబంటి ఎఫెక్ట్ తో మహానంది ఆలయంలోకి వెళ్లడానికి భయపడుతున్నారు భక్తులు. పదేళ్ల క్రితం మహానంది అటవీ ప్రాంతంలో ఎలుగుబంటి దాడిలో మృతి చెందాడు అటవీశాఖ అధికారి రామచంద్రారెడ్డి. ఎలుగుబంటిని పట్టుకోవడానికి అడవిలోకి వెళ్లడానికి భయపడుతోంది సిబ్బంది. ఇక సర్కార్ ఆదేశాలతో ఎలుగుబంటి సంచరించే ప్రాంతంలో బోనులను పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.