Devotional

ఈ రాశివారికి కొత్త ఉద్యోగ అవకాశాలు

ఈ రాశివారికి కొత్త ఉద్యోగ అవకాశాలు

🕉️హిందూ ధర్మం🚩
🌹 శుభోదయం 🌹
✍🏻 09.09.2023 ✍🏻
🗓 నేటి రాశి ఫలాలు 🗓

🐐 మేషం
ఈరోజు (09-09-2023)

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఏ పనీ పెండింగులో పెట్టకపోవడం మంచిది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ఆలోచనలు మంచి ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఉద్యో గంలో మరో మెట్టు పైకెక్కే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం ఉంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. పితృవర్గం నుంచి స్థిరాస్తి లాభాలు పొందడం జరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 వృషభం
ఈరోజు (09-09-2023)

రోజంతా అనుకున్న విధంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి లోటుండదు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 మిధునం
ఈరోజు (09-09-2023)

ప్రధాన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్ల, అన్ని రంగాలవారు ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. చాలా మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదానికి సంబంధించి తోబుట్టువులతో రాజీమార్గం అనుసరిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. ప్రయాణాలలో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఉద్యోగులు శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.
💑💑💑💑💑💑💑

🦀 కర్కాటకం
ఈరోజు (09-09-2023)

ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండదు. చేపట్టిన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలి స్తాయి. ఒక శుభ కార్యం మీద బాగా ఖర్చు చేస్తారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిదానంగా ముందుకు వెడతాయి. నిరుద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 సింహం
ఈరోజు (09-09-2023)

వ్యక్తిగత వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగు తాయి. కొందరు బంధువులతో మాట పట్టింపులు వచ్చే సూచనలున్నాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
🦁🦁🦁🦁🦁🦁

💃 కన్య
ఈరోజు (09-09-2023)

దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుంచి చాలావరకు బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిపాటి ఆందోళనలుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో అనుభవజ్ఞుల సలహాలు తీసుకుని ముందుకు వెడతారు. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. శుభకార్యంలో మిత్రులకు సహాయం చేస్తారు. ఉద్యో గంలో అదనపు పనిభారం వల్ల విశ్రాంతి కరువవుతుంది. బంధుమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కివస్తాయి. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది.
💃💃💃💃💃💃💃

⚖ తుల
ఈరోజు (09-09-2023)

ముఖ్యమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల కొన్ని శుభ ఫలితాలు చోటు చేసుకుంటాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్ది ప్రయత్నంతో ఎక్కువ లాభాలు పొందుతారు.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 వృశ్చికం
ఈరోజు (09-09-2023)

తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో ప్రత్యర్థులు, పోటీదార్ల మీద విజయం సాధిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో మీ ఆలోచనలు కార్య రూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 ధనుస్సు
ఈరోజు (09-09-2023)

ఈ రాశికి చెందిన అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం సంతృప్తి కరంగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఒకటి రెండు మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలతో లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 మకరం
ఈరోజు (09-09-2023)

వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి రాణిస్తాయి. ఉద్యోగంలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఇంటా బయటా కొద్దిగా పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. దైవ చింతన పెరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 కుంభం
ఈరోజు (09-09-2023)

కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని విభేదాలు తలెత్తుతాయి. విదేశీ ప్రయా ణానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు తగిన స్పందన లభిస్తుంది. ధన వ్యవహారాల్లో ఎవరికీ మాట ఇవ్వడం మంచిది కాదు. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 మీనం
ఈరోజు (09-09-2023)

ఉద్యోగం మారడానికి ప్రయత్నిస్తున్న ఉద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభి స్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు పెద్దల సిఫారసుతో సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. ఇంటి కోసం విలువైన వస్తు సామగ్రి కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు.
🦈🦈🦈🦈🦈🦈🦈