Movies

నేనొస్తున్నా…బాబు ముత్యం లాగా బయటికొస్తారు

నేనొస్తున్నా…బాబు ముత్యం లాగా బయటికొస్తారు

జగన్‌పై ఈడీ సహా అనేక కేసులున్నాయి.. బెయిల్‌పై బయట తిరుగుతున్నారు. ఎన్నికల్లో పరాజయం తప్పదన్న భయంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. జగన్‌ 16 నెలలు జైలులో ఉండి వచ్చారు. చంద్రబాబును 16 రోజులైనా జైలులో పెట్టాలని జగన్‌ కుట్ర చేస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ముందుగా గుజరాత్‌లో ప్రారంభించారు. సీఎం కేవలం పాలసీ మేకర్.. అధికారులే అమలు చేస్తారు. అజేయ కల్లం ప్రతిపాదిస్తే.. ప్రేమ్‌చంద్రారెడ్డి అమలు చేశారు. ప్రభుత్వం రూ.370 కోట్లు ఖర్చు చేసింది. 2.13 లక్షలమందికి శిక్షణ ఇచ్చారు. డిజైన్‌ టెక్‌ సంస్థకు జగన్‌ ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చింది. జగన్‌.. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. ఇలాంటివి ఎన్నో చూశాం.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు .

అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు ఒక బ్రాండ్. న్యాయ పోరాటం చేస్తాం. ఉన్న సంస్థలను జగన్‌ విధ్వంసం చేసి.. యువతను గంజాయికి బానిస చేశారు. ఆయన చేసే కుట్రలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు గాలికబుర్లు చెబుతున్నారు. పీల్చే గాలిపై కూడా పన్నులు వేస్తారు. మొరిగితే పట్టించుకోను.. అతిక్రమిస్తే ఉపేక్షించను. ప్రజలు అనుభవించింది చాలు.. మార్పుకోసం సైనికుల్లా పనిచేయాలి. రాష్ట్రం కోసం ప్రతిఒక్కరూ ఉద్యమించాల్సిన సమయమిది. చంద్రబాబుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తాం. నేనొస్తున్నా.. ఎవరూ భయపడాల్సిన పనిలేదు. తెలుగువాడి సత్తా, పౌరుషాన్ని చూపిద్దాం’’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.