ScienceAndTech

ఇది ChatGPT సత్తా. 3ఏళ్లుగా వైద్యులకు దొరకని వ్యాధి గుర్తింపు.

ఇది ChatGPT సత్తా. 3ఏళ్లుగా వైద్యులకు దొరకని వ్యాధి గుర్తింపు.

మూడు సంవత్సరాలు, 17 మంది డాక్టర్లు ఎంత శ్రమించినా 4 సంవత్సరాల బాబుకు వచ్చిన జబ్బును గుర్తించలేకపోయారు. కానీ, చాట్‌జీపీటీ సులువుగా ఆ పని చేసి పెట్టింది. కోర్ట్నీ అనే మహిళ తన కొడుకు అలెక్సాకు వచ్చిన జబ్బును తెలుసుకోవాలని చాలా ప్రయత్నించింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సమయంలో తన బిడ్డకు ఓ జబ్బు వచ్చింది. ఏం తిన్నా పంటి నొప్పి రావటం, ఎత్తు పెరగకపోవటం వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమె జబ్బును గుర్తించి చికిత్స అందించాలని చాలా ప్రయత్నించింది. దాదాపు మూడేళ్లు ఎంతో మంది డాక్టర్లను సంప్రదించింది. ఎవరూ తన బిడ్డ జబ్బును కనిపెట్టలేకపోయారు. దీంతో ఏం చేయాలో తెలియక ఒక రోజు మొత్తం కంప్యూటర్‌ ముందే కూర్చొని చాట్‌జీపీటీ సాయం కోరింది. ఎంఆర్‌ఐ రిపోర్డులో ఉన్న ప్రతి అంశం గురించి చాట్‌జీపీటీని వివరంగా అడిగింది. అలాగే తన బిడ్డకున్న లక్షణాలు పంచుకుంది. చివరకు, ‘టెథర్డ్ కార్డ్ సిండ్రోమ్ (తెథెరెద్ చొర్ద్ స్యంద్రొమె)’ అనే అరుదైన న్యూరోలాజికల్ కండిషన్‌తో తన కొడుకు బాధపడుతున్నట్లు గుర్తించింది. వెంటనే న్యూరోసర్జన్‌ను సంప్రదించింది తన తనయుడికి టెథర్డ్‌ కార్డ్‌ సిండ్రోమ్‌తో బాధ పడుతున్నాడనే అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఇక ఆ డాక్టర్‌ అలెక్స్‌ జబ్బుని నిర్థారించి శస్త్రచికిత్స చేశారు. దీంతో తన కొడుకు జబ్బు నుంచి బయటపడినట్లు, కొంచెం ఎత్తు పెరిగాడంటూ ఆమె తన ఆనందాన్ని పంచుకుంది.