Business

సులువుగా వీడియోల సృష్టికి కొత్త యాప్‌! – వాణిజ్యం

సులువుగా వీడియోల సృష్టికి కొత్త యాప్‌! – వాణిజ్యం

వీడియో క్రియేటర్లకు ‘యూ-ట్యూబ్’ గుడ్ న్యూస్ తెలిపింది. తేలిగ్గా వీడియోలు తయారు చేసుకునేలా ‘యూ-ట్యూబ్ క్రియేట్’ అనే యాప్ తెస్తున్నట్లు వెల్లడించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా డిజైన్ చేసిన ‘డ్రీమ్ సీన్’ ఫీచర్ కూడా పరీక్షిస్తున్నట్లు తెలిపింది. దీంతో షార్ట్ వీడియోలకు ఏఐ ఆధారిత వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోలు జోడించడానికి వీలవుతుంది.

న్యూ జనరేటివ్ ఏఐ ఆధారిత యాప్‌లో ఎడిటింగ్ ట్రిమ్మింగ్, ఆటోమేటిక్ క్యాప్షనింగ్, వాయిస్ ఓవర్, ట్రాన్సిషన్స్ తదితర ఫీచర్లు ఉంటాయి. టిక్ టాక్ మాదిరే బీట్ మ్యాచింగ్ టెక్నాలజీ’తో వచ్చే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్’ను కస్టమర్లు వాడవచ్చు.

సులువుగా వీడియోలు క్రియేట్ చేయడానికి, షేర్ చేయడానికి ఈ యాప్ డెవలప్ చేశాం. షార్ట్, లాంగ్ వీడియోల రూపకల్పనకు దీన్ని తీసుకొచ్చాం’ అని యూ-ట్యూబ్ కమ్యూనిటీ ప్రొడక్ట్స్ వైస్ ప్రెసిడెంట్ టోనీ చెప్పారు.

ఉచితంగా అందుబాటులోకి ఉన్న ఈ యాప్.. ఇప్పటికైతే భారత్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, ఇండోనేషియా, దక్షిణ కొరియా, సింగపూర్ తదితర సెలెక్టెడ్ మార్కెట్లలో ఆండ్రాయిడ్‌లో బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. వచ్చే ఏడాది ఆపిల్ ఐ-ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుందీ యాప్.