Sports

అజారుద్దీన్‌పై వేటు-తాజావార్తలు

అజారుద్దీన్‌పై వేటు-తాజావార్తలు

* హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేయకుండా మహ్మద్‌ అజహరుద్దీన్‌పై అనర్హత వేటు పడింది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు కమిటీ అనర్హత వేటు వేసింది. గతంలో ఏకకాలంలో హెచ్‌సీఏ, డెక్కన్‌ బ్లూస్‌ క్లబ్‌ అధ్యక్షుడిగా అజహరుద్దీన్‌ వ్యవహరించారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉండి నిబంధనలు ఉల్లంఘించినందుకు కమిటీ అనర్హత వేటు వేసింది. ఈ మేరకు హెచ్‌సీఏ ఓటరు జాబితా నుంచి అజహరుద్దీన్‌ పేరును తొలగిస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది.

* అధికారం ఇచ్చినపుడు ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్‌ పార్టీ.. ఇవాళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. హామీలతో ప్రలోభపెట్టాలని ఆ పార్టీ చూస్తోందని ఆరోపించారు. మోసాన్ని మోసంతోనే జయించి.. ఓటు భారాస అభ్యర్థులకు వేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

* ఐటీఐ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్‌ చెప్పింది. హైదరాబాద్‌ శివారులోని హకీంపేట్‌లో TSRTC ఐటీఐ నూతన కళాశాలకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌(డీజీటీ) తాజాగా అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం నుంచే కళాశాలను ప్రారంభించాలని నిర్ణయించినట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (Skill Development case) అరెస్టయిన తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. అక్టోబరు 19 వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో రాజమహేంద్రవరం జైలులో ఉన్న చంద్రబాబుకు రెండో దఫా విధించిన రిమాండ్‌ గడువు గురువారంతో ముగిసింది. ఈనేపథ్యంలో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్‌గా జడ్జి ఎదుట హాజరుపరిచారు.

* తెలంగాణలో 2022-23 ఏడాదిలో 22 లక్షలకుపైగా ఓట్లను పరిశీలించి తొలగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. శాసనసభ ఎన్నికల సన్నాహకాలపై సమీక్ష కోసం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ (సీఈసీ) ఇతర కమిషనర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయన వెల్లడించారు.

* ఏపీ సీఎం జ‌గ‌న్ చేసిన పాపాలు రాయ‌ల‌సీమ‌ ప్రాంతానికి శాపాలుగా మారుతున్నాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జ‌గ‌న్ చేసిన నేరాలు, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలకు ఉరివేస్తున్నాయన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌లో) పోస్టు చేశారు. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేక హోదా వదులుకున్నారని, రుషికొండకు గుండు కొట్టిన కేసు నుంచి త‌ప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్‌కి నీళ్లొదిలారని విమర్శించారు.

* మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు (Errabelli Dayakarrao) కాంగ్రెస్‌ పార్టీపై ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమల్లో లేవని విమర్శించారు. భరోసా లేని కాంగ్రెస్‌ హామీలు నమ్మి మోసపోవద్దని ప్రజలను కోరారు.

* ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు. ఈ రోజు ఉదయం మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌ విభాగంలో భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం స్వర్ణ పతకం గెల్చుకోగా.. తాజాగా ఇదే విభాగంలో పురుషుల టీమ్‌ కూడా పసిడి పతకాన్ని సాధించింది. ప్రవీణ్ ఒజాస్‌, అభిషేక్ వర్మ, ప్రథమేష్ సమాధాన్ జావ్‌కర్‌ బృందం దక్షిణ కొరియా జట్టుని 235-230 తేడాతో ఓడించడంతో భారత్‌ ఖాతాలో 21వ స్వర్ణ పతకం చేరింది.

* మద్యం కుంభకోణం (Delhi excise policy scam case) కేసులో ఆప్‌ నేత, దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోదియా (Manish Sisodia)కు సంబంధించిన రెండు బెయిల్‌ పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కేంద్ర ఏజెన్సీలకు సర్వోన్నత న్యాయస్థానం పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఈ కేసులో సిసోదియాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలున్నాయని ప్రశ్నించింది.

* ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. 2023 సంవత్సరానికి గానూ సాహిత్యం (Literature)లో నోబెల్‌ బహుమతిని గురువారం ప్రకటించారు. నార్వేకు చెందిన రచయిత జాన్‌ ఫోసెను ఈ ఏడాది సాహిత్య నోబెల్‌ వరించింది.
10. Anurag Thakur: వారంతా జైల్లో ఉన్నారు.. త్వరలో ఆయన వంతు వస్తుంది: అనురాగ్ ఠాకూర్‌

* దిల్లీ మద్యం పాలసీ కుంభకోణం (Delhi Liqur Policy Scam) కేసులో దర్యాప్తు సంస్థల విచారణ కొనసాగుతోందని, త్వరలోనే ప్రధాన సూత్రధారి కూడా జైలుకెళ్లడం ఖాయమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్‌ (Anurag Thakur) అన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పుర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆప్‌ (AAP) ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

* రోడ్లపై బైక్‌తో స్టంట్‌ (Bike Stunt)లు చేసి ప్రమాదానికి గురైన కేసులో అరెస్టయిన ఓ యూట్యూబర్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు (Madras High Court) నిరాకరించింది. ర్యాష్‌ డ్రైవింగ్‌పై యువతను ప్రేరేపిస్తున్న అతడు గుణపాఠం నేర్చుకోవాల్సిందేనని న్యాయస్థానం ఆగ్రహించింది. అతడు తన యూట్యూబ్‌ ఛానల్‌ను మూసివేయాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే..తమిళనాడు (Tamil Nadu) చెందిన టీటీఎఫ్‌ వాసన్‌ (Youtuber TTF Vasan) యూట్యూబ్‌లో చాలా పాపులర్‌. బైక్‌ స్టంట్లు, రోడ్ ట్రిప్పులపై వీడియోలు చేసి పోస్ట్‌ చేస్తుంటాడు. అతడి ఛానల్‌కు లక్షల మంది ఫాలోవర్లున్నారు. సెప్టెంబరు 17న అతడు ఓ రోడ్‌ ట్రిప్‌లో భాగంగా చెన్నై-వేలూరు హైవేపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. దమాల్‌ సమీపంలో బైక్‌పై స్టంట్స్ చేస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లాడు. అయితే, ఆ సమయంలో అతడు హెల్మెంట్‌, రేస్‌ సూట్‌ వేసుకుని ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అతడి చేతికి ఫ్రాక్చర్‌ అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. సెప్టెంబరు 26న అతడి బెయిల్‌ పిటిషన్‌ను కాంచిపురం సెషన్స్‌ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే అతడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాడు.

* యువ నటీనటులను టార్గెట్‌ చేసుకుని జరుగుతోన్న కొత్తరకం స్కామ్‌పై నటుడు బ్రహ్మాజీ (Brahmaji) తాజాగా ట్వీట్లు చేశారు. తాము స్టార్‌ దర్శకుల వద్ద పనిచేస్తున్నామంటూ పలువురు వ్యక్తులు.. యువ నటులకు సందేశాలు పంపిస్తున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా డబ్బులు కూడా వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

* స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో (Skill development case) తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజులపాటు సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ప్రమోద్‌కుమార్‌ దూబే వాదిస్తూ స్కిల్‌ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని అన్నారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో ఈ కేసులో ఇరికించారని కోర్టుకు వివరించారు. ‘‘ డిజైన్‌ టెక్‌ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో మాత్రమే నిధులు మంజూరు చేశారు. ఒప్పందం ప్రకారం 40 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 2లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గానే జరిగింది.. ఇందులో స్కామ్‌ ఎక్కడుంది?చంద్రబాబు పాత్ర ఏముంది?ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఆయన అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. సీఐడీ కస్టడీలో విచారణకు చంద్రబాబు సహకరించారు. మరోసారి ఆయన కస్టడీ అవసరం లేదు. విచారణ సాగదీయడానికే కస్టడీ పిటిషన్‌ వేశారు. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయాలి’’ అని కోర్టును కోరారు.

* ఫైబర్‌నెట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌ చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు చంద్రబాబుని బాధ్యుడ్ని చేయడం సరికాదని చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదించారు. రాజకీయ కక్షతో మాత్రమే కేసు నమోదు చేశారని కోర్టుకు వివరించారు. రెండేళ్ల క్రితం కేసుపెట్టి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని, హఠాత్తుగా ఆయన పేరును చేర్చారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

* దిల్లీలో (Delhi) అక్టోబర్‌ 9న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించానికి కాంగ్రెస్‌ (Congress) సన్నద్ధమవుతోంది. తాజా రాజకీయ పరిస్థితులు, కులగణన, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను ఆ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో భాజపాను, తెలంగాణలో భారాస, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్‌ను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై తాజా సమావేశంలో నేతలు చర్చించే అవకాశం ఉంది. ఇటీవల బిహార్‌లో వెల్లడైన కుల గణన నివేదికపై ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం కన్పిస్తోంది. కులగణనను గట్టిగా సమర్థిస్తున్న కాంగ్రెస్‌ జనాభా ప్రాతిపదికన సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తోంది. దిల్లీ మద్యం విధానం కేసులో ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ బుధవారం అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చేపడుతున్న విచారణ గురించి కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తారని సమాచారం.

* విజ‌య డెయిరీకి పాలు స‌ర‌ఫ‌రా చేసే పాడి రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 350 కోట్ల ప్రోత్సాహ‌కాలు ఇచ్చామ‌ని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పెండింగ్ బ‌కాయిల‌ను కూడా త్వ‌ర‌లోనే అందిస్తామ‌ని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని రావిర్యాల వ‌ద్ద దేశంలోనే అత్యాధునిక‌, ఆటోమేష‌న్ ప్రాసెసింగ్ టెక్నాల‌జీతో నిర్మించిన విజ‌య మెగా డెయిరీని మంత్రులు త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స‌బితా ఇంద్రారెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ మెగా డెయిరీని 40 ఎక‌రాల విస్తీర్ణంలో రూ. 250 కోట్ల‌తో నిర్మించారు. రోజుకు ల‌క్ష లీట‌ర్ల టెట్రా బిక్ పాల ఉత్ప‌త్తి చేసేలా మిష‌న‌రీ ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో పాడి రైతుల‌ను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ప్ర‌సంగించారు. భార‌త‌దేశంలోనే అతి పెద్ద‌దైన మెగా డెయిరీని మ‌న రాష్ట్రంలో ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంది. రికార్డు స‌మ‌యంలో 2 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ్య‌వ‌ధిలోనే పూర్తి చేసి ప్రారంభించుకున్నాం. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను కాపాడుకోవ‌డం అభినంద‌నీయం అని కేటీఆర్ పేర్కొన్నారు.

* జపాన్‌ (Japan) లో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈస్ట్‌ కోస్ట్‌ ఏరియాలోని ఇజూ (Izu) ఐస్‌ల్యాండ్స్‌లో సముద్రంలో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.6గా నమోదైనట్లు తెలిపారు.

* మ‌హారాష్ట్ర‌లో బీజేపీ-సేన‌-ఎన్సీపీ స‌ర్కార్‌పై యువ సేన నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌హారాష్ట్ర‌లో ప్ర‌స్తుతం ఒక సీఎం, ఇద్ద‌రు “స‌గం” డిప్యూటీ సీఎంలు ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. ఏక్‌నాథ్ షిండే సార‌ధ్యంలోని మ‌హారాష్ట్ర స‌ర్కార్‌పై ఆదిత్య ఠాక్రే విరుచుకుప‌డుతూ షిండే హ‌యాంలో అవినీతి పెచ్చుమీరింద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం రాజ‌కీయ ప్ర‌క‌న‌ల‌పై పెద్ద‌మొత్తంలో ఖ‌ర్చు చేస్తూ పాల‌న‌ను గాలికొదిలేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. రాష్ట్రంలో ప‌లు ఆస్ప‌త్రుల్లో రోగుల ప్రాణాలు గాల్లో క‌లిసిన ఘ‌ట‌న‌ల‌ను ఆయన ప్ర‌స్తావించారు. షిండే స‌ర్కార్ ప‌ట్ల ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో తిరిగి ఎంవీఏ అధికారంలోకి వ‌స్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

* ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆప్‌ సర్కార్‌పై కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సంచలన విమర్శలు చేశారు. ఇదే సమయంలో సీఎం కేజ్రీవాల్‌ను టార్గెట్‌ చేసి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. త్వరలోనే ఈ కేసులో ‘కింగ్ పిన్’(కేజ్రీవాల్‌) కూడా జైలులో ఉంటారని అన్నారు. అయితే, మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ నిజాయితీ సర్టిఫికెట్ ఇచ్చిన వారు జైల్లో ఉన్నారని, ఆయన కూడా త్వరలోనే జైలుకు వెళ్లారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆయన ముఖంలో టెన్షన్ కనిపిస్తోంది. డిప్యూటీ సీఎం జైల్లో ఉన్నారు. ఆరోగ్య మంత్రి జైల్లో ఉన్నారు, ఇండియాలో అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వచ్చిన వారే ఇప్పుడు అవినీతికి పాల్పడుతున్నారు అంటూ కౌంటరిచ్చారు.