Politics

విశాఖలో జగన్‌ ఫ్లెక్సీకి మద్యంతో అభిషేకం

విశాఖలో జగన్‌ ఫ్లెక్సీకి మద్యంతో అభిషేకం

విశాఖలో సీఎం జగన్‌ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేసి మహిళలు నిరసన తెలిపారు. ఆదివారం ఉదయం భారతీయ చైతన్య యువజన (బీసీవై) పార్టీ మహిళా విభాగం ఆర్కే బీచ్‌ రోడ్డులో పెద్దఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. మహిళలు ప్లకార్డులు పట్టుకుని ర్యాలీలో ఉన్నారు. ‘బూమ్‌ బూమ్‌ బ్రాండుల సృష్టికర్త.. రుషికొండను మింగిన అనకొండ… జగనొస్తున్నాడు… జాగ్రత’ అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో నిషేధం చేస్తామన్న హామీని తుంగలో తొక్కారని మద్య. ఈ వంటి జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. నిరసన చిత్రాలు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయినందున పోలీసులు ఆ మహిళల గురించి ఆరా తీస్తున్నారు.