DailyDose

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్ అంటూ బెదిరింపు

శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్ అంటూ బెదిరింపు

శంషాబాదులోని రాజీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హైదరాబాద్ ఎయిర్ పోర్టు అధికారులు భద్రతను మరింత పటిష్ఠం చేశారు. ఎయిర్‌పోర్టులో హైఅలర్ట్‌ విధించారు. పోలీసులతో ఎయిర్ పోర్టులో తనిఖీలను ముమ్మరం చేయనున్నారు. అధికారుల హడావుడి చూసి ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. విమానాశ్రయంలో పార్కింగ్, డిపాశ్చర్, ఆగమనాలు విభాగాల్లో సీఐఎస్ఎఫ్ పోలీసులు డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు మొదలు పెట్టారు. ఏం జరుగుతుందో అర్థంకాక నిశ్చేస్టులై నిలబడిపోయారు. అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించారు.

అసలేం జరిగిందంటే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానం హైజాక్ చేయబోతున్నట్లు అధికారులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాన్ని హైజాక్ చేయ బోతున్నట్లు అందులో రాసుకొచ్చారు. అగంతకుడు చేసిన మెయిల్ చూసిన ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తం అయ్యారు. ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది వెంటనే దుబాయ్ వెళ్లే విమానాన్ని ఆపి క్షుణ్నంగా తనిఖీలు చేశారు. అంతే కాకుండా ఎయిర్ పోర్ట్ లో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. మరోవైపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై టెక్నికల్ సిబ్బంది ఆరా తీసేపనిలో పడ్డారు.