NRI-NRT

సింగపూర్‌లో బతుకమ్మ వేడుకలు

సింగపూర్‌లో బతుకమ్మ వేడుకలు

షురూ అయిన సింగపూర్ బతుకమ్మ సంబురాలు*

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో! సింగపూర్ గౌరమ్మ ఉయ్యాలో!! అంటూ ఆడబిడ్డలు అందరూ ఈ సంవత్సరం కూడా సింగపూర్ లో బతుకమ్మ పండగ ను పెద్ద ఎత్తున జరుపుకోవటానికి ప్రతి ఇంటి నుండి కదలి రానున్నారు. ఒక్కొక్క పువ్వును శ్రద్దతో రాశులుగా పేరుస్తూ ఆ గౌరమ్మ తల్లి ఆశీస్సు కోసం ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా సింగపూర్ తెలుగు సమాజం (STS) ఆధ్వర్యాన తెలంగాణ గ్రామీణ సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ పండుగ అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 5గం౹౹ నుండి స్థానిక టాంపనిస్ సెంట్రల్ పార్క్ నందు జరుపుకోవటానికి ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. దసరా పండుగ ముందు వచ్చే వారాంతం కనుక కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు కురిచేటి స్వాతి చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత గాయని వరమ్ ప్రత్యక్ష గానం ప్రత్యేక ఆకర్షణ అని, కార్యక్రమానికి హాజరు అయ్యే వారందరికీ పసందైన భోజన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అంతేకాకుండా మొదటి 3 ఆకర్షణీయమైన బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు, ఒక లక్కీ విజేతకు 5 గ్రా౹౹ బంగారం బహుమతిగా ఇస్తున్నామని గౌ౹౹ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ తెలిపారు. సింగపూర్ లోని పలు ప్రాంతాల నుండి ప్రత్యేక రవాణా (బస్) ఏర్పాటు చేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున్న నిర్వహిస్తున్న ఈ వేడుకలు జయప్రదంగా జరగాలని తెలుగువారందరూ ఆకాంక్షిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z