NRI-NRT

గల్ఫ్‌ ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశం

గల్ఫ్‌లో ఎన్ఆర్ఐ టీడీపీ సమావేశం

గల్ఫ్‌లో ఎన్నారై తెలుగుదేశం, జనసేన నేతలు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జూమ్‌ కాల్‌లో ఈ భేటీని నిర్వహించారు. గల్ఫ్‌లో ఎన్నారై తెదేపా కార్యవర్గాలు గత ఏడాది ఏర్పడి.. గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడు రాధాకృష్ణ ఆధ్వర్యంలో విస్తృతంగా పనిచేస్తున్నాయి. అలాగే జనసేన పార్టీ కోసం పది రోజుల క్రితం అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గల్ఫ్ కార్యవర్గాన్ని నియమించారు.

చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావం తెలియజేస్తూ పవన్ కల్యాణ్.. తెదేపాతో పొత్తును ప్రకటించిన విషయం తెలిసిందే. జనసేన, తెలుగుదేశం కలిసి పనిచేయాలని, ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. ఈ పిలుపునకు అనుగుణంగా గల్ఫ్‌లోని తెలుగుదేశం శ్రేణులు, జన సైనికులు కూడా కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో.. ఎన్నారై తెలుగుదేశం గల్ఫ్ నాయకులు, జనసేన గల్ఫ్ నేతలు ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటుచేసి పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గల్ఫ్ దేశాల ఎన్నారై తెలుగుదేశం ఎంపవర్మెంట్‌ కో-ఆర్డినేటర్స్ సుధాకర్ కుదరవల్లి, తులసీ కుమార్, కౌన్సిల్ మెంబర్స్ వెంకట్ కోడూరి, హరిబాబు తక్కిలపాటి, హరిబాబు నల్లి, ఖాదర్ బాషా, సత్య మలిరెడ్డి, అధ్యక్షులు ఖాలిద్ సైఫుల్లా, విశ్వేశ్వర రావు, నాగేంద్ర బాబు, ఈశ్వర్ నాయుడు, రఘునాథ్ బాబు, మొహమ్మద్ ఇమాం, రమణతో పాటు జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్లు త్రిమూర్తులు కేసరి, రాందాస్, శ్రీకాంత్, రామచంద్ర నాయక్, చంద్ర శేఖర్, వివిద దేశాల ప్రాంతీయ కన్వీనర్లు భాస్కర్ రావు, నగేష్, మూర్తి, అంజన కుమార్, సూర్యనారాయణ రాజేష్ లింగయ్య , రాయుడు, భరత్, నాని అడ్డాల తదితరులు పాల్గొని ఒకరికొకరు పరిచయం చేసుకుని క్లుప్తంగా ప్రసంగించారు.

అంతా కలిసి పనిచేసి 2024లో తెలుగుదేశం-జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆంధ్ర ప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని ముక్తకంఠంతో ప్రతిజ్ఞ చేశారు. జనసేన గల్ఫ్ జాతీయ కన్వీనర్స్ త్రిమూర్తులు, రాందాస్ ఈ జూం కాల్‌ని ఏర్పాటు చేసిన రాధాకృష్ణకు, పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z