Business

ఎన్టీపీసీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఎన్టీపీసీలో ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ లిమిటెడ్‌(NTPC Limited)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 495 ఇంజినీరింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రైనీ(Engineering executive trainees) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్‌ 20వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

పోస్టుల వివరాలు: ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 495 పోస్టులను విభాగాల వారీగా పరిశీలిస్తే.. ఎలక్ట్రికల్‌ (120), మెకానికల్‌ (200), ఎలక్ట్రానిక్స్‌/ఇన్‌స్ట్రుమెంటేషన్‌ (80), సివిల్‌ (30), మైనింగ్‌ (65) చొప్పున ఉన్నాయి.

వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగులు/ఎక్స్‌సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

విద్యార్హత: అభ్యర్థులు కనీసం 65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55శాతం) బీటెక్‌ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత. దీంతో పాటు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష రాసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: గేట్‌-2023లో సాధించిన స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వేతనం: ఎంపికైనవారికి 40,000 నుంచి రూ.1,40,000వేతనంతో పాటు ఇతర సదుపాయాలు ఉంటాయి.
ఎంపికైన అభ్యర్థులు వేర్వేరు చోట్ల ఏడాది పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక పోస్టింగ్‌ ఇస్తారు. దేశంలో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.

👉 – Please join our whatsapp channel here
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z