Business

గూగుల్ క్రోమ్ వినియోగదారులు అలర్ట్‌

గూగుల్ క్రోమ్ వినియోగదారులు అలర్ట్‌

ఎక్కువమంది వినియోగించే వెబ్‌బ్రౌజర్‌ గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome) యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. కంప్యూటర్లలో పాత క్రోమ్‌ బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే యూజర్లు వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని భారత ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ ఏజెన్సీ.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పానెస్స్ టీమ్‌ ఆఫ్ ఇండియా (CERT-IN) హెచ్చరికలు జారీ చేసింది. క్రోమ్‌ బ్రౌజర్‌లో ‘అనేక లోపాల’ కారణంగా మీ కంప్యూటర్‌ను సైబర్‌ నేరగాళ్లు రిమోట్‌గా యాక్సెస్‌ చేయొచ్చని పేర్కొంది.

గూగుల్‌ క్రోమ్‌ విండోస్‌ వెర్షన్‌ 118.0.5993.70/.71.. మ్యాక్‌, లైనక్స్‌ వెర్షన్‌ 118.0.5993.70 కంటే ముందు వెర్షన్ల బ్రౌజర్లను వినియోగిస్తున్న వారికి ఈ ముప్పు పొంచి ఉందని సెర్ట్‌-ఇన్‌ తెలిపింది. ఆయా బ్రౌజర్లలో లోపాల కారణంగా రిమోట్‌గా దాడి చేసే వ్యక్తి.. సిస్టమ్‌లోకి ఆర్బిట్రరీ కోడ్‌లను జొప్పించడం, సర్వీస్‌లను తిరస్కరించడం (DoS), లక్షిత సిస్టమ్‌లలో ఉన్న సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టే ప్రమాదం ఉందని సెర్ట్‌-ఇన్‌ తన హెచ్చరికల్లో పేర్కొంది. కాబట్టి వెంటనే గూగుల్‌ క్రోమ్‌ లేటెస్ట్‌ వెర్షన్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది.

ఒకవేళ మీరు గూగుల్‌ క్రోమ్‌ ఏ వెర్షన్‌ వాడుతున్నారో తెలుసుకోవాలంటే.. బ్రౌజర్‌ను ఓపెన్‌ చేసి కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేసి సెట్టింగ్స్‌లో ‘అబౌట్‌ క్రోమ్‌’ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీ బ్రౌజర్‌ ప్రస్తుత వెర్షన్‌తో పాటు అప్‌డేట్‌ అయిందా? లేదా? అనేది చూపిస్తుంది. ఒకవేళ బ్రౌజర్‌ అప్‌డేట్‌ కాకుంటే అప్‌డేట్ చేసి రీలాంచ్‌ చేయాలి. లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ అయ్యి ఉంటే ‘క్రోమ్‌ ఈజ్‌ అప్‌ టూ డేట్‌’ అని చూపిస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z