Business

ఒక్క రూపాయికే బస్‌ టికెట్‌ పొందే అవకాశం

ఒక్క రూపాయికే బస్‌ టికెట్‌ పొందే అవకాశం

బస్‌ బుకింగ్‌ యాప్‌ అభిబస్‌ ఫెస్టివ్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా కస్టమర్లు ఒక్క రూపాయికే టికెట్‌ పొందే అవకాశం ఉంది. అయితే ఎంత మందికి ఈ చాన్స్‌ దక్కుతుందనేది కంపెనీ ప్రకటించలేదు.అక్టోబర్‌ 19 నుంచి 25 మధ్య ప్రయాణ తేదీలకు ఆఫర్‌ వర్తిస్తుంది. ఈ ఆఫర్‌ దక్కని వారిలో రోజుకు 100 మంది లక్కీ విన్నర్స్‌కు బస్‌ టికెట్‌ వోచర్స్‌ ఇస్తారు. ఈ ఆఫర్‌ ప్రైవేట్‌ బస్‌లు, ఎంపిక చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్‌ బుకింగ్స్‌కు వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.

👉 – Please join our whatsapp channel here

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z