Devotional

అమ్మవారి నవదుర్గలలో కాత్యాయని పేరు ఎలా వచ్చిందో తెలుసా?

అమ్మవారి నవదుర్గలలో కాత్యాయని పేరు ఎలా వచ్చిందో తెలుసా?

అమ్మవారి నవదుర్గలలో ఆరో రూపం కాత్యాయని. ‘కత్య అనే రుషి తనకు పార్వతీమాత కుమర్తెగా జన్మించాలని తపస్సు చేస్తే అతనికి కూతురుగా జన్మించింది.కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ని వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అశంతో దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్లసప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమినాడు మహిషాసురుణ్ని వధిస్తుంది. ఈమె స్వరూపం, దివ్యం, భవ్యమూ, బంగారు వన్నెతో మెరుస్తూ ఉంటుంది. నాలుగు భుజాలతో కుడిచేతులలో అభయముద్రనూ, వరదముద్రనూ కలిగి ఉంటుంది. ఈమె ఎడమ చేతిలో ఖడ్గమూ, మరొ చేతిలో పద్మంతో సింహం తో శోభిల్లుతుంది..

నైవేద్యం : రవ్వ కేసరి, అల్లం గారెలు

కాత్యాయని ధ్యాన శ్లోకం :

చందరహాసోజ్వలకరా శార్దూలవరవాహనా|
కాత్యాయనీ శుభం దద్ద్యాద్దేవీ దానవ ఘాతినీ||

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z