Devotional

నేటి మీ రాశిఫలాలు

నేటి మీ రాశిఫలాలు

మేషం [03-11-2023]

ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధి సూచనలున్నాయి. సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను మీరు మోయడం వల్ల ఫలితం ఉండదు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా సమస్యలుంటాయి. అయితే వాటిని పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు.

వృషభం [03-11-2023]

ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు. సతీమణి నుంచి కూడా ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉండవచ్చు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు సునాయాసంగా పూర్తవుతాయి. వ్యాపారాల్లో కూడా అంచనాల మించి లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మిథునం [03-11-2023]

వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగంలో బాగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతభత్యాలు, ప్రమోషన్ వంటి విషయాలకు సంబంధించి శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కాస్తంత ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృథా ఖర్చులకు కళ్లెం వేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమా లకు సహాయంగా నిలబడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది.

కర్కాటకం [03-11-2023]

వృత్తి, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి, కొన్ని దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. చేపట్టిన వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సతీమణికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

సింహం [03-11-2023]

ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధి కారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. మితిమీరిన ఔదార్యంతో ఇతరులకు సహాయం చేస్తారు. పుణ్యకార్యాల మీద కూడా ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సతీమణికి మంచి గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువర్గంలో తగిన పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

కన్య [03-11-2023]

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూ లంగా మారుతాయి. అప్రయత్న కార్యసిద్ధికి, వ్యవహార జయానికి అవకాశం ఉంది. సతీమణితో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. నిరుద్యోగులు తమకు లభించిన ఉద్యోగావకాశాలను సద్వి నియోగం చేసుకోవడం మంచిది. దూరపు బంధువుల నుంచి ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పిల్లలు విజయాలు సాధిస్తారు.

తుల [03-11-2023]

ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. అధికారులకు సన్నిహితం అవుతారు. ఒక శుభ కార్యంలో ఇష్టమైన వారిని కలుసుకుంటారు. దూర ప్రయాణాలను చివరి క్షణంలో వాయిదా వేసుకునే అవ కాశం ఉంది. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

వృశ్చికం [03-11-2023]

ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా బయటపడతారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ప్రయాణాలలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. సతీసమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. పిల్లలు విజయాలు సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగాలలో చిన్నా చితకా సమ స్యలను అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీలకు, స్పెక్యులేషన్, షేర్లకు దూరంగా ఉండడం మంచిది. సతీమణి నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది.

ధనుస్సు [03-11-2023]

సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆదాయం ఆశించిన దాని కంటే బాగా పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తోబుట్టువులతో వివాదం పరిష్కారం అవుతుంది. స్నేహితులతో విలా సాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రముఖులతో లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. సతీమణి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి.

మకరం [03-11-2023]

వృత్తి జీవితం ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ఆశించిన ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. మాట తొందర వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. సతీమణిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇంటా బయటా ఒత్తిడి కాస్తంత ఎక్కువగా ఉంటుంది. ఒక శుభవార్త వింటారు.

కుంభం [03-11-2023]

పెండింగు పనులు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా, నిలకడగా సాగిపోతాయి. ఉద్యోగ వాతావరణం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అనుకోని ఖర్చులు మీద పడతాయి. పిల్లల చదువుల పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. సతీ మణికి వృత్తి, ఉద్యోగాలపరంగా మంచి గుర్తింపు లభిస్తుంది. దైవ కార్యాలకు ఆర్థికంగా సహాయ పడతారు. స్నేహితుల సాయంతో వ్యక్తిగత సమస్యను పరిష్కరించుకుంటారు. ప్రయాణాలు లాభి స్తాయి.

మీనం [03-11-2023]

ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన మేరకు మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో శుభ వార్తలు అందు కుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఎవరికీ హామీలు ఇవ్వకపోవడం మంచిది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.