Business

ఎస్‌బీఐ రెండవ త్రైమాసికానికి 14330 కోట్ల లాభం

ఎస్‌బీఐ రెండవ త్రైమాసికానికి 14330 కోట్ల లాభం

కేంద్ర ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) సెప్టెంబర్ త్రైమాసికంలో 9.13 శాతం గ్రోత్ సాధించింది. 2023-24 రెండో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికరలాభం రూ.16,099 కోట్ల నికర లాభం గడించింది. ఏడాది క్రితం 2022-23 రెండో త్రైమాసికంలో నికర లాభం రూ.14,752 కోట్లు, జూన్ త్రైమాసికంలో రూ.18,356 కోట్ల నికర లాభం గడించింది. దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ నెట్ వర్క్ లో ఎస్బీఐది ఐదో స్థానం.

కానీ, నికర వడ్డీ ఆదాయంలో మాత్రం మార్కెట్ అంచనాలను బీట్ చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 12 శాతానికి పైగా రూ.39,500 కోట్లు నికర వడ్డీ ఆదాయం సముపార్జించింది. మార్కెట్ వర్గాలు రూ.38,500 కోట్ల నికర వడ్డీ ఆదాయం పొందుతుందని అంచనా వేశాయి. సెప్టెంబర్ త్రైమాసికం మొత్తం ఆదాయం 26.4 శాతం పెరిగి రూ.1.12 లక్షల కోట్లకు చేరుకున్నది. గతేడాది రూ.88,733 కోట్ల ఆదాయం పొందింది.

స్థూల మొండి బకాయిలు 2.55 శాతంగా ఉన్నాయి. జూన్ త్రైమాసికంలో 2.76 శాతం ఉంటే, గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల మొండి బకాయిలు 3.52 శాతం. ఇక నికర మొండి బకాయిలు గతేడాదితో పోలిస్తే 0.80 శాతం నుంచి 0.64 శాతానికి తగ్గాయి. జూన్ త్రైమాసికంలో 0.71 శాతం నికర మొండిబకాయిలు నిలిచాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z