Videos

దమ్ మసాలా’ పాట విడుదల

దమ్ మసాలా’ పాట విడుదల

మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ రూపొందిస్తోన్న చిత్రం ‘గుంటూరు కారం’(Guntur Kaaram). త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలిపాటను చిత్రబృందం విడుదల చేసింది. ప్రోమోలో మహేశ్ స్టైల్‌కు ఫిదా అయిన ఆడియన్స్‌లో ఈ పాట జోష్ నింపేలా ఉంది. మహేశ్‌ పూర్తి మాస్‌ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ఆయన సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి ఆడిపాడనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోన్న ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. సంజిత్‌ హెగ్డే, తమన్‌ ఆలపించారు. ఘాటు పుట్టిస్తోన్న ‘దమ్‌ మసాలా బిర్యానీ..’పాటను మీరూ వినేయండి..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z