రాష్ట్ర హైకోర్టుకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. జస్టిస్ సుధీర్‌కుమార్‌ను మద్రా స్ హైకోర్టుకు, జస్టిస్ చిల్లకూర్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేయాలని కొద్ది రోజుల కిందట సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.ఆ సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారని కేంద్రమంత్రి పేర్కొన్నారు. వీరితోపాటు ఇతర రాష్ట్రాల కు చెందిన మరో ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకికూడా రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తు ల సంఖ్య (సీజేతో కలిపి) 42 కాగా, ప్రస్తుతం 28 మంది ఉన్నారు. జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ సుధీర్‌కుమార్ బదిలీతో ఆ సంఖ్య 26కు చేరగా.. ఖాళీల సంఖ్య 16కు పెరిగింది.
👉 – Please join our whatsapp channel here –