Politics

ఈసీతో టీఎస్‌ఆర్టీసీ జేఏసీ భేటీ

ఈసీతో టీఎస్‌ఆర్టీసీ జేఏసీ భేటీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. టీఎస్‌ఆర్టీసీ జేఏసీ సభ్యులు ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు జీవో విడుదల చేయడంపై ఫిర్యాదు చేశారు.

వివరాల ప్రకారం..‘తెలంగాణ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై టీఎస్‌ఆర్టీసీ జేఏసీ సభ్యులు ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అశ్వథ్థామ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు అక్రమంగా జీవో ఇచ్చారు. హరిత నిధి పేరుతో కార్మికుల జీతాల నుంచి రూ.300 కట్‌ చేస్తున్నారు. అక్రమంగా జీవో ఇచ్చి జీతాలు కట్‌ చేయడం చట్టరీత్యా నేరం. జీవో రద్దు చేయాలని కమిషన్‌ను కోరాం’ అని తెలిపారు. మరోవైపు.. అశ్వథ్థామ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎన్నికలకు పోలింగ్‌ గడువు సమీపిస్తున్న కొద్దీ నేతలు ఇంకా పార్టీలు మారుతూనే ఉన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z