Food

త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

త్వరగా రాత్రి భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. పూర్వకాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక విధానాలను పాటించేవారు. కానీ ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే అనేక రోగాల బారిన పడుతున్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజలందరూ ఆశ్చర్యకరంగా ఎక్కువ ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు.

ఈ కోవలోకే వస్తుంది ఇటలీలోని అబ్రుజోలో ఉన్న ఎల్’అక్విలా అనే ప్రాంతం. ఇక్కడి ప్రజలు వందేళ్లకు పైగా జీవిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇంత ఆరోగ్యంగా ఉండటానికి వీళ్లు ఏం చేస్తున్నారు? ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నారు అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇటలీలోని ఎల్’అక్విలా ప్రాంతానికి చెందిన ప్రజలు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటారని రీసెర్చ్‌లో తేలింది. ఇక్కడి ప్రజల ఆయుష్షు ఎక్కువ ఉండటానికి ప్రధాన కారణం వాళ్ల ఆహార నియమాలని తేలింది. వీళ్లు ముఖ్యంగా రాత్రి భోజనాన్ని 7గంటల లోపలే ముగిస్తారని, దీనివల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్‌లోని రీసెర్చ్‌లో వెల్లడైంది.

రాత్రి భోజనం నుంచి మరుసటి రోజు భోజనం చేసే సమయం సుమారు 17.5 గంటల పాటు వ్యవధి ఉండేలా పక్కాగా పాటిస్తారట.ప్రాసెస్‌ చేసిన మాంసం, స్వీట్లకు ఎల్’అక్విలా ప్రజలు దూరంగా ఉంటారట. వీళ్లు తీసుకునే ఆహారంలో తక్కువ కెలరీలు ఉండేలా చూసుకుంటారని, దీనివల్ల దీర్ఘాయువు పెరుగుతుందని అధ్యయనంలొ వెల్లడైంది.

రాత్రి త్వరగా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

త్వరగా భోజనం చేయడం వల్ల శరీరంలో మెటాబాలిజం పెరుగుతుంది.

రాత్రి భోజనం త్వరగా చేయడం వల్ల జీర్ణ క్రియ రేటు కూడా పెరుగుతుంది.

బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

త్వరగా తినడం వల్ల మంచిగా నిద్రపడుతుంది.

రాత్రి త్వరగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా కడుపులో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

త్వరగా భోజనం చేయడం వల్ల శరీరానికి అవసరమైన ‍ప్రోటీన్స్‌ అందుతాయి.

శరీరంలో డిటాక్సిఫికేషన్‌ ప్రక్రియ వేగవంతంగా పనిచేస్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z