Videos

టిల్లు స్క్వేర్ నుంచి ‘రాధిక’ సాంగ్

టిల్లు స్క్వేర్ నుంచి ‘రాధిక’ సాంగ్

గత ఏడాది ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’గా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ సక్సెస్‌‌ను అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ‘డీజే టిల్లు’కు సీక్వెల్‍గా ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) సినిమా తెరకెక్కుతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది 2024 ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది.

లేటెస్ట్ గా ఈ మూవీ నుండి రాధికా లిరికల్(Radhika Song) సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రాధికా..రాధికా..ముందుకా..వెనుకాక అంటూ ఉన్న సాంగ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. “చెప్పు రాధిక..ఏం కావాలి నీకు..నేను నీకు ఎలా సహాయపడగలను రాధిక. ఈసారి నా కొంప ఎలా ముంచబోతున్నావు చెప్పు” అనే సిద్ధు డైలాగ్‍తో ఈ లిరికల్ సాంగ్ మొదలైంది.

‘రింగుల జుట్టు చూసి పడిపోయానే..నీ మాటలు విని పడిపోయానే..నీ గాలి సోకితేనే సచ్చిపోయానే’ అంటూ కాసర్ల శ్యామ్ (Kasarla shyam) క్యాచీ లిరిక్స్ రాశారు. రామ్ మిరియాల కంపోజ్ చేయడంతో పాటు తనే స్వయంగా ఈ పాటను పాడాడు.ఈ సాంగ్ యూత్‍కు కనెక్ట్ అయ్యేలా క్యాచీ లైన్స్ భలే ఆకట్టుకుంటున్నాయి.ఇక ఈ పాట కూడా ఇంకొన్నాళ్ళు ఆడియన్స్ ను చిల్ అయ్యేలా చేస్తుందనే ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాకు రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై టిల్లు స్క్వేర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z